సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కే సుబ్బారావమ్మ మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు జీతాలు పెంచకపోవడం చాలా దారుణం

0

27/6/2025
మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ (వాటర్, పార్కు , వెహికల్ డిపో మెకానిక్, టౌన్ ప్లానింగ్, స్ట్రీట్ లైటింగ్, కంప్యూటర్ ఆపరేటర్స్)కార్మికుల జీతాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని విజయవాడ నగరంలో నిరవధిక సమ్మె మూడో రోజు కొనసాగుతుంది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కే సుబ్బారావమ్మ మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు జీతాలు పెంచకపోవడం చాలా దారుణం అని అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట అధికారంలోనికి రాకముందు ఒక మాట చెప్పడం ఈ ప్రభుత్వాలకు అలవాటుగా మారిందని పోరాడితే పోయేదేమీ లేదని రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు ఆశలు ఉద్యమం మీరు చూశారని ఈరోజు ప్రభుత్వం మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా ప్రమోట్ చేయడం పోరాట విజయమని అలాగే మీ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెరుగుదలకు సిఐటియు వెన్నుదను గా నిలబడుతుందని మాట్లాడారు

యూనియన్ అధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ రెండో రోజు సమ్మెకు నగరంలో వన్ టౌన్ ప్రాంతంలో కొన్నిచోట్ల నీరు అందడం లేదు, నీరు అందే పరిస్థితి లేదు, వాటర్ సప్లై కార్మికులు దాదాపుగా అందరూ సమ్మెలో ఉన్నారు. ప్రజలకు తాగునీరు అందక ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం నీమ్మకం నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది తప్ప సమస్య పరిష్కారానికి మాత్రం పూనుకోవడం లేదు. పార్క్ సెక్షన్ కార్మికులు నిన్నా, మొన్న వానకి చెట్లు రాఘవ పార్కు వద్ద ఉన్న జడ్జిగారి బంగ్లా పక్కన పడిపోతే తీసే నాధుడు లేక ట్రాఫిక్ ని డైవర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వచ్చేనెల నాలుగో తారీఖు నుండి పారిశుధ్య, డ్రైనేజీ, వెహికల్ డిపో,ఇతర రంగాల కార్మికులు సమ్మెలోకి వస్తే నగర జీవనం స్తంభించిపోతుంది.అని, గత ప్రభుత్వం జీవో నెంబర్ 36 జీతాలు పెంచమని అడుగుతున్నామని గత ప్రభుత్వం ఇచ్చిన జీవో కాపీ ప్రకారం జీతాలు వర్తింప చేయమని అడుగుతున్నామని, సమ్మె కాలం ఒప్పందం హామీలు అమలు చేయమని అడుగుతున్నామన్నారు. 36వ నెంబర్ జీవ ప్రకారం 21 వేల రూపాయలు జీతం 24 వేల రూపాయలు జీతం అమలు చేయమని అడుగుతున్నామన్నారు
అందుకని ఎవరికీ ఇబ్బంది లేకుండా చూస్తామని మంత్రిగారిచ్చిన డేటు ఇప్పటికి నాలుగు సార్లు పోస్ట్ ఫోన్ చేశారని చర్చలో ఫలప్రదం కావట్లేదు కాబట్టే సమ్మెలోకి దిగామని ఆయన అన్నారు. సమ్మెకు సంబంధించి ఏ విధమైన ఇబ్బంది లేకుండా పరిష్కారం చేయడానికి అవకాశాలు ఉన్నాయి కానీ ప్రభుత్వం చొరవ చూపాలని అన్నారు. మంత్రి నాలుగు సార్లు సమయం ఇచ్చారు కానీ ఆ నాలుగు సార్లు పోస్ట్ ఫోన్ చేసుకుంటూ వచ్చారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపకుండా ఆయన మమ్మల్ని నమ్మిస్తా ఉన్నాడుఅని మనందరం ఐక్యంగా కలిసి పోరాడాలని ప్రభుత్వం మెడలు మంచి ఖచ్చితంగా జీతాలు పెరుగుదలకు సాధించుకుంటామని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షుడు జ్యోతి బస్, నగర కోశాధికారి డి స్టీఫెన్ బాబు, వాటర్ సెక్షన్ బాధ్యులు దుర్గారావు, నారాయణ , నల్ల శీను,శివ, పార్క్ సెక్షన్ బాధ్యులు టీ చిన్న, కృష్ణవేణి, కుమారి, స్వరూప, వెహికల్ డిపో మెకానిక్ సెక్షన్ బాధ్యులు దుర్గాప్రసాద్, కిషోర్, కోటేశ్వరరావు, టౌన్ ప్లానింగ్ సెక్షన్ బాధ్యులు రవి,నగర ఉపాధ్యక్షురాలు టి. తిరుపతమ్మ, జై.విజయలక్ష్మి నగర ఆర్గనైజింగ్ కార్యదర్శి టి. ప్రవీణ్, సేలం దాసు, వి. సాంబులు ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version