శాసన మండలిలో యువత సమస్యలను వినిపించే గొంతుక పేరాబత్తుల రాజశేఖరం

0

 తేది:15.02.2025

నిడదవోలు

శాసన మండలిలో యువత సమస్యలను వినిపించే గొంతుక పేరాబత్తుల రాజశేఖరం

 

*ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత తమ తొలి ప్రాధాన్యత ఓటు కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం కి వేసి గెలిపించాలని పిలుపునిచ్చిన మంత్రి కందుల దుర్గేష్*

*కూటమి అభ్యర్థి గెలుపుకోసం కృషి చేయాలని సమిశ్రగూడెం విజ్ఞాన వికాస్ కాలేజీలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్త సమావేశంలో కూటమి శ్రేణులకు మంత్రి దుర్గేష్ దిశానిర్దేశం*

నిడదవోలు: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ని గెలిపించుకునేలా యువతలో చైతన్యం కల్పించాలని కూటమి శ్రేణులకు  మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.శనివారం నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు రూరల్ మండలంలోని సమిశ్రగూడెం గ్రామంలో విజ్ఞాన వికాస్ కళాశాలలో ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు బోరుగడ్డ వేదవ్యాస్ ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్త సమావేశంలో మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత తమ తొలి ప్రాధాన్యత ఓటును పేరాబత్తుల రాజశేఖరంకు వేసి అఖండ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని అవగాహన కల్పించారు.  పేరాబత్తుల రాజశేఖరంను గెలిపిస్తే యువత గొంతుకై వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మండలిలో కృషి చేస్తారన్నారు.యువత సమస్యలపైనే కాదు అన్ని వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజశేఖరంకు పూర్తిస్థాయిలో అవగాహన ఉందని తెలిపారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం, పేద ప్రజల కోసం చేసిన సంక్షేమాన్ని కూలంకషంగా వివరించిన మంత్రి దుర్గేష్ సంబంధిత విషయాలను యువతకు చేరేందుకు కృషి చేసి పేరాబత్తుల విజయంకు కృషి చేయాలని తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version