శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున పట్టువస్త్రాల సమర్పణ.

Spread the love

శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున పట్టువస్త్రాల సమర్పణ.

శ్రీకాళహస్తి ఆలయ కార్యనిర్వహణ అధికారి బి.కె. వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, బోర్డు సభ్యుల సమర్పణ.

విజయవాడ, 11 అక్టోబర్ 2026.

ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున ఆలయ కార్యనిర్వహణ అధికారి బి.కె. వెంకటేశ్వర్లు, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, దేవస్థానం బోర్డు సభ్యులు కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలతో సారెను సమర్పణలు అందజేశారు.

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని, భక్తిశ్రద్ధలతో సమర్పణలు అందజేశారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. ఆలయ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలు ప్రతిబింబించే లా శ్రీకాళహస్తి దేవస్థానం అర్చకులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు కలిసి అమ్మవారికి సారెను సమర్పించారు.

Loading