మంత్రి పెనమలూరు మండలం యనమలకుదురులో నూతంగా నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరమును(పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం),

0

 *పెనమలూరు (యనమలకుదురు): జూలై 06, 2024*

రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ దిశగా ముందుకు సాగుతోందని, పేదలకు అవసరమైన వైద్య సదుపాయాల కల్పనకు దాతలు సహకారం అందించాలని రాష్ట్ర వైద్య, విద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై.సత్య కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు.

శనివారం ఉదయం మంత్రి పెనమలూరు మండలం యనమలకుదురులో నూతంగా నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరమును(పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం),

రాష్ట్ర వైద్య, విద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ చీఫ్ సెక్రటరీ ఎంటి కృష్ణబాబు, స్థానిక శాసన సభ్యులు బోడే ప్రసాద్ తో కలిసి  ప్రారంభించారు.

ఈ క్రమంలో ఆయన ఆస్పత్రిలోని పలు విభాగాల వార్డులు, అదునాతన పరికరాలు, ఇతర వైద్య సదుపాయాలను పరిశీలించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ వికసిత్ భారత్ మాదిరిగా వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణ ప్రక్రియలో రాష్ట్ర ప్రజలందరూ భాగస్వామ్యం అవుతూ సహకారం అందించాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత పేద ప్రజల ఆరోగ్యమేనని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని, రాబోయే ఐదు సంవత్సరాలలో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడం తమ లక్ష్యం అన్నారు. 

ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో అనేక అధునాతన వైద్య పరికరాలు, సౌకర్యాలను సమకూర్చడం జరిగిందని, అదనంగా వైద్యులు, స్టాఫ్ నర్స్ లు, ఇతర వైద్య సిబ్బందిని నియమించామన్నారు. 

ఆసుపత్రులు ప్రాణం పోసే నిజమైన దేవాలయాలన్నారు. ప్రజలకు వచ్చే వ్యాధులను అందుబాటులో ఉన్న వైద్య పరీక్షల ద్వారా గుర్తించి ప్రాథమిక దశలోనే చికిత్స పొందాలని, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

యనమలకుదురుతో పాటు పటమట, తాడిగడప ప్రాంత పేద ప్రజల సౌకర్యార్థం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అయిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర నిర్మాణమునకు సహకారం అందించిన సామాజిక బాధ్యత, స్పృహ కలిగిన వెలగపూడి ట్రస్ట్ వారి కృషి అభినందనీయమన్నారు.

రాష్ట్ర వైద్య, విద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ చీఫ్ సెక్రటరీ ఎంటి కృష్ణబాబు మాట్లాడుతూ ప్రతి నలుగురులో ఒకరు బిపి, షుగర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. వాటి పట్ల అశ్రద్ధ చేయకుండా గ్రామాల్లోనే అందుబాటులో ఉన్న వైద్య పరీక్షలు ద్వారా నిర్ధారించుకొని ముందు నుంచే అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఎమ్మెల్సీ అశోక్ కుమార్ మాట్లాడుతూ వైద్య ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని మంత్రిని కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బోడె ప్రసాద్ సభాధ్యక్షునిగా వ్యవహరించగా, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటలూ వైద్య సేవలు అందించే విధంగా చూడాలని మంత్రిని కోరారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం నిర్మాణానికి సహకారం అందించిన ట్రస్టు నిర్వాహకులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు అశోక్ కుమార్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ పద్మావతి, డిఎంహెచ్వో డాక్టర్ జి గీతాబాయి, వెలగపూడి ట్రస్ట్ వ్యవస్థాపకులు రాజకుమార్, వైద్యులు, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version