పెన్షన్ లను సకాలంలో ప్రజలకు అందించండి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

0

 విజయవాడ నగరపాలక సంస్థ 

30-11-2024

పెన్షన్ లను సకాలంలో ప్రజలకు అందించండి

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

 పెన్షన్లను సకాలంలో ప్రజలకు అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శనివారం ఉదయం తన పర్యటనలో భాగంగా 21వ డివిజన్ కృష్ణలంక ప్రాంతం పర్యటించి పెన్షన్ దారులకు కమిషనర్ పెన్షన్ పంపిణీ చేసారు. 

 ఆ ప్రాంతంలో గల ప్రజలతో స్వయంగా మాట్లాడి ప్రతినెల పెన్షన్ వస్తుందా లేదా? ఎంత పెన్షన్ వస్తుంది? ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అని మాట్లాడితెలుసుకున్నారు. ప్రతి నెల సమయానికి పెన్షన్ సిబ్బంది అందిస్తున్నారని ఎటువంటి సమస్యలు లేదని వారు తెలుపగా సంతృప్తి చెందారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మధ్యాహ్నం మూడు గంటల వరుకు, సర్కిల్ వన్ పరిధిలో 20744 పెన్షన్ లకు గాను 19326, సర్కిల్ 2 పరిధిలో 25906 పెన్షన్ లకు గాను 23877, సర్కిల్ 3 పరిధిలో 20721 పెన్షన్ లకు గాను 19089, మూడు సర్కిల్స్ పరిధిలో మొత్తం 67371 పెన్షన్ లకు 62292 పెన్షన్ల పంపిణీ చేశారని, అంటే దాదాపు 93% పెన్షన్ పంపిణీ చేశారని తెలిపారు.

 ఈ పర్యటనలో పి.ఓ (యూ సి డి) నారాయణ, జోనల్ కమిషనర్ ప్రభుదాస్, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version