జిల్లాలో జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యం సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వేగంగా వెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను

0

 జిల్లాలో జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యం

సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వేగంగా వెళ్తున్న

ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను 

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 36వ డివిజన్ శారదా కాలేజ్ సెంటర్లో జన సేన పార్టీ నాయకులు రుద్ర శేఖర్ నాయుడు ఆధ్వర్యంలో జెండా దిమ్మ ఆవిష్కరణ, మజ్జిగ చలివేంద్రం ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ ఎన్ టీ ఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉదయభాను మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పనిచేయాలని ప్రతి ఒక్క జన సైనికుడికి పిలుపునిచ్చారు. డివిజన్ స్థాయిలో జనసేన పార్టీ లక్ష్యాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లడం, పార్టీకి ఆకర్షితులుగా ఉన్న వారిని పార్టీలో చేర్చడానికి కృషిచేయాలన్నారు. కూటమిలో భాగ్యస్వామ్యమైనందుకు ప్రతి ఒక్క కార్యకర్త ప్రజా సమస్యల పరిష్కారం కొరకు అధికారుల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. పార్టీలో కార్యకర్తగా ఉంటూ రుద్ర శేఖర్ నాయుడు పార్టీ బలోపేతం కోసం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రజలకు సేవా కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజల వద్దకి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు బలంగా వెళ్లాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లిశెట్టి వంశీ కృష్ణ , జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు , నగర ఉపాధ్యక్షులు కామల్ల సోమనాథo , జగ్గయ్యపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్ రావు , జనసేన పార్టీ కార్పొరేటర్లు మహదేవపు అప్పాజీ , మరుపిళ్ల రాజేష్ , సెంట్రల్ ఆంధ్ర జోన్ కో కన్వీనర్ కొప్పిరెడ్డి సూర్య నారాయణమూర్తి (ఎస్ ఎన్ మూర్తి) , కృష్ణా పెన్నా రీజియన్ కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి , జనసేన పార్టీ సీనియర్ నాయకులు అజయ్ ఠాకూర్ వర్మ , డాక్టర్ కొండవీటి సంతోష్ కృష్ణ , విజయవాడ నగరానికి చెందిన పలువురు డివిజన్ అధ్యక్షులు, జన సైనికులు, వీరమహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version