Say No to Drugs Awareness కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్

0

 

ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ. తేదీ.03.02.2025

Say No to Drugs Awareness కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్

మాదక ద్రవ్యాల వినియోగ సమస్యను ఎదుర్కొనటానికి ముందడుగు వేసే లక్ష్యంతో, విజయవాడలోని పి.బి.సిద్దార్థ కాలేజీ ఆధ్వర్యంలో  సే నో టు డ్రగ్స్  పేరుతో విజయవాడ పీబీ సిద్ధార్ధ కళాశాలలో డ్రగ్స్ నివారణపై విద్యార్ధులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమనానికి ముఖ్య అతిదిగా నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్, ఈగల్ టీం ఐ.జి. ఆకే రవి కృష్ణ ఐ.పి.ఎస్ ఎస్.పి. కె.నగేష్ బాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ. విద్యార్ధులు మత్తు పదార్ధలకు దూరంగా ఉండాలి, మాదకద్రవ్య వినియోగం వ్యక్తులను మాత్రమే కాదు, కుటుంబాలను, సమాజాన్ని కూడా నిర్వీర్యం చేస్తుందని, ఉత్తరాంధ్రలో గంజాయి సాగు జరుగుతుంది, గతంలో 9 వేల ఎకరాల్లో గంజాయిని పండించే వారు, ఈగల్ విభాగం ఏర్పాటైన తర్వాత గంజాయి పంటను ధ్వంసం చేశారు. ప్రస్తుతం 100 ఎకరాల్లో మాత్రమే ఉందని తేలింది,డ్రోన్స్ ద్వారా గంజాయి సాగు ఎక్కడ జరుగుతుందని గుర్తిస్తున్నాం, గంజాయి సేవించిన వారికి సైతం ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం శిక్ష పడుతుంది, ఒకసారి గంజాయి నేరస్తుల జాబితాలో పేరు నమోదైతే పాస్ పోర్టు సైతం రాదు, గంజాయి కోసం దొంగతనాలకు, నేరాలకు పాల్పడుతున్నారు, విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాల వెనుక గంజాయి ప్రభావం ఉంది, మత్తు పదార్దాలకు అలవాటు పడిన స్నేహితులకు దూరంగా ఉండండి, ఎవరైనా డ్రగ్స్ సేవించాలని మిమ్మల్ని బలవంతం చేస్తే ..ధైర్యంగా నో అని చెప్పండి. కేవలం చట్ట అమలుతో ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. సమాజం అందరూ కలిసి ముందుకు రావాలి. యువత మాదకద్రవ్య రహిత జీవనానికి ఆదర్శంగా నిలవాలి.” అని ఆయన అన్నారు. అదేవిధంగా సైబర్ నేరాల మరియు డిజిటల్ అరెస్ట్ ల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది.

ఈగల టీం ఐ.జి. రవి కృష్ణ ఐ.పి.ఎస్ మాట్లాడుతూ.ప్రతీ కళాశాలలో ఈగల్ బృందాలను ఏర్పాటు చేస్తాం, ఎన్డీపీఎస్ యాక్ట్ కేసుల్లో ఇరుక్కుంటే 20 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది, రెండు ఎన్డీపీఎస్ కేసుల్లో నిందితులుగా ఉంటే ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసు తీవ్రత ఆధారంగా మరణశిక్ష వేసేందుకు అవకాశం ఉంది, విద్యార్ధులే ఈగల్ అంబాసిడర్లుగా ఉండాలి, గంజాయి విక్రయాలు,వినియోగంపై సమాచారం తెలిస్తే 1972 నెంబర్ కి కాల్ చేయండి, గంజాయిని కట్టడి చేసేందుకు ఈగల్ విభాగం చర్యలు చేపట్టింది, విద్యార్ధులు మత్తు పదార్ధాల జోలికి వెళ్లి ..విలువైన భవిష్యత్ ను కోల్పోవద్దు అని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ .ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్, ఈగల్ టీం ఐ.జి. ఆకే రవి కృష్ణ ఐ.పి.ఎస్, ఎస్.పి. కె.నగేష్ బాబు, సెంట్రల్ ఎ.సి.పి. దామోదర్ , మాచవరం ఇన్స్పెక్టర్ ప్రకాష్, కళాశాల డైరెక్టర్ బాబురావు , సుమారు 500 మంది విద్యార్ధులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version