30-6-2025
NDA కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు పరుగులెత్తించిన -MLA బొండా ఉమ
జూలై 2 నుంచి కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న “సుపరిపాలనలో – తొలి అడుగు” కార్యక్రమం విజయవంతం చేయండి నాయకులకు దిశా నిర్దేశం -MLA బొండా ఉమ
ధి:30-6-2025 సోమవారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం సింగ్ నగర్ లోని షాది ఖానా నందు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, ప్రభుత్వ విప్, నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించుకోవడం జరిగింది.
ఈ సమావేశంలో బొండా ఉమా మాట్లాడుతూ:- ఈనెల 29-6-2025 నిన్న రాష్ట్ర పార్టీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జరిగిన సమావేశ వివరాలను తెలియజేస్తూ, ప్రధానంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పూర్తయిన సందర్భంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను నెరవేర్చడమే కాకుండా రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి వైపు ప్రయాణం చేసినటువంటి ప్రభుత్వం NDA ప్రభుత్వం అని, అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలను వివరించడం జరిగింది
ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలలో పెన్షన్ల పెంపుదల, అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించడం, మహిళలకు గుధి బండ లాగా మారిన గ్యాస్ సిలిండర్లను ఏడాదికి 3 ఉచితంగా అందించడం, ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంత మందికి తల్లికి వందనం పథకం ద్వారా ₹15 వేల రూపాయలు అందించడం, నిరుద్యోగ భృతి, అదేవిధంగా 18 ఏళ్లు నుండి 59 సంవత్సరాల లోపు మహిళలకు ఏడాదికి నెలకి 1500 ఏడాదికి 18 వేల రూపాయలు చొప్పున ఇచ్చేటువంటి సంపూర్ణ సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చడమే కాకుండా.
అమరావతి రాజధానిగా నిర్మిస్తూ ఇప్పటికే పనులు ప్రారంభించి నలువైపులా అభివృద్ధి చేయడం జరుగుతుందని, రాష్ట్రంలో ఒక అమరావతిని అభివృద్ధి చేయడమే కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని, రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పరిశ్రమలు తీసుకుని వచ్చి పారిశ్రామిక రాష్ట్రం కింద అభివృద్ధి చేయడమే కాకుండా యువతకు విద్యార్థులకు మంచి భవిష్యత్తు కల్పించాలని, మహిళలకు కూడా అన్ని విధాల అన్ని రంగాలలో సముచిత స్థానాన్ని ఇస్తూ రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుందని
ఈ అభివృద్ధి సంక్షేమ వివరాలను ప్రజలందరికీ తెలియజేయవలసినటువంటి బాధ్యత నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మనందరి పైన ఉన్నదని, రేపు జూలై 2 నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించేటటువంటి కార్యక్రమాలలో నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి NDA కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమం వివరాలను ప్రజలకు వివరంగా తెలియజేయాలని, సెంట్రల్ నియోజకవర్గం జిల్లాలోనే ముందంజలో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని, ఇప్పటికే ( కుటుంబ సాధికార సారథులు KSS ) ద్వారా నియోజకవర్గంలో 9,000 మందిని, 267 బూత్ లెవెల్ ఏజెంట్లను, 56 యూనిట్ ఇంచార్జ్ లను, వీరందరిని పర్యవేక్షించడానికి 11 మంది క్లస్టర్ లను కో క్లస్టర్ ఇంచార్జిల్ గా మరొక 11 మందిని ద్వారా ప్రత్యేకమైన బృందం తో నెల రోజులపాటు సెంట్రల్ నియోజకవర్గం లో ఉన్నటువంటి 2 లక్షల 70 వేల మందికి పైగా ఓటర్లను కలిసి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన పద్ధతిని వివరించి, ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్నటునటువంటి సమస్యలను తెలుసుకొని యుద్ద ప్రాతిపదికన వారి సమస్యలను పరిష్కారం చేసి రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల కార్పొరేషన్ ఎన్నికలలో నియోజకవర్గంలో ఉన్నటువంటి 21 డివిజన్ లలో తెలుగుదేశం పార్టీ NDA కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపుకి కృషి చేయాలని నియోజకవర్గం లోని కార్పొరేటర్లకు, నాయకులకు కార్యకర్తలకు డివిజన్ పార్టీ అధ్యక్షులకు, ఇంచార్జ్, ప్రధాన కార్యదర్శి, అనుబంధ సంఘాల నాయకులకు వివరించడం జరిగింది
సంస్థాగత ఎన్నికలకు నియోజకవర్గ పరిశీలకులుగా వచ్చినటువంటి గొప్పన పవన్ కుమార్ మాట్లాడుతూ:- సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేయడంలో నియోజకవర్గ MLA బొండా ఉమామహేశ్వర నాయకత్వంలో ముందుకు పోతా ఉందని, ఇప్పటికే 21 డివిజన్ లకు సంబంధించిన నూతన క్లస్టర్ ఇన్చార్జిలతో పాటు, అనుబంధ సంఘాల నాయకులను నియమించి బలమైన నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ తయారు చేసిందని, భవిష్యత్తులో మరింత పటిష్టంగా ముందుకు పోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికలలో గతంలో 21 డివిజన్ లకు 18 డివిజన్ లు కార్పొరేటర్ సీట్లు సాధించినటువంటి ఘనత ఉందని, రేపు రాబోయే ఎటువంటి రోజులలో 21 కి 21 సీట్లు కైవసం చేసుకొని ఎన్డీఏ కూటమి బలమెంటు చూపించాలని తగు సూచనలు చేయడంతో పాటు రాష్ట్ర పార్టీ నిర్ణయాలను కూడా సమావేశంలో వెల్లడించారు
ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, కార్పొరేటర్లు వీరమాచినేని లలిత, వల్లభనేని రాజేశ్వరి, కంచి దుర్గ, మోదుగుల తిరుపతమ్మ, తెలుగుదేశం పార్టీ బీసీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం గౌడ్, మాజీ AMC డైరెక్టర్ ఘంటా కృషమోహన్, మాజీ కార్పొరేటర్లు పైడి తులసి, ఎరుబోతు శ్రావణి, విజయ్ కృష్ణ సూపర్ బజార్ చైర్మన్ వెలగా సురేష్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సురవరపు నాగరాజు సెంట్రల్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు బెజ్జం జయపాల్, తెలుగు మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, బిసి సెల్ అధ్యక్షులు ఇప్పిలి రామ్మోహన్రావు, SC సెల్ అధ్యక్షులు వేల్పుల రాజేష్, మైనారిటీ సెల్ అధ్యక్షులు SK గౌస్ బాషా, ST సెల్ అధ్యక్షులు లక్ష్మణ్, ITDP అధ్యక్షులు దుర్గాసి రాము, సాంస్కృతిక విభాగం అధ్యక్షులు మాదాల సత్యవతి, లా కమిటీ అధ్యక్షులు గడ్డం రాజేశ్వరరావు, డాక్టర్స్ కమిటీ అధ్యక్షులు యడ్లపాటి శేష సాయి, ప్రొఫెషనల్ వింగ్ రూపేష్, క్రిస్టియన్ కమిటీ రత్నబాబు, అంగన్వాడి కమిటీ అధ్యక్షురాలు గులివిందల లీలా, నియోజకవర్గ క్లస్టర్ ఇన్చార్జులు అలా తారక రామారావు, బత్తుల కొండ, వింజమూరి సతీష్, కంచి ధన శేఖర్, ఘంటా కృష్ణమోహన్, నవనీతం సాంబశివరావు, పిన్నమరాజు త్రిమూర్తి రాజు, తుమ్మలపెంట శ్రీనివాసులు, నెలిబండ్ల బాలస్వామి, వల్లభనేని సతీష్, సింగం వెంకన్న, కో క్లస్టర్స్ గ సర్వేపల్లి అమర్నాథ్ గౌడ్, తొట్టెంపూడి ఉదయ్ శంకర్, మరక శ్రీనివాస్ యాదవ్, దాసరి కనకారావు, దాసరి నాగరాజు, దారపునేని సతీష్ చంద్రమౌళి, ఇప్పిలి రామ్మోహన్రావు, బడేటి ధర్మారావు, తిరుమల శెట్టి ఉదయభాస్కర్, పరుచూరి శివ భార్గవ్, నెక్కంటి ప్రసాద్ లు డివిజన్ పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఇన్చార్జులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు