జీవిత రాజశేఖర్ .. ఏ విషయంలోనైనా నిర్మొహమాటంగా వ్యవహరిస్తారు. అందువలన జీవిత – రాజశేఖర్ ఇద్దరూ కూడా కొన్ని వివాదాలను ఫేస్ చేయవలసి వచ్చింది. కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవిత మాట్లాడుతూ, అనే విషయాలను గురించి ప్రస్తావించారు.
“నేను .. రాజశేఖర్ గారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాము. అందువలన కొన్ని సమస్యలు ఎదురైన మాట నిజమే. మా ఇద్దరి వరకూ అలా నడిచింది .. కానీ ఇప్పుడు పిల్లలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మేమంటే పడనివారి వలన, మా పిల్లల కెరియర్ ఎఫెక్ట్ కాకూడదు. మా కారణంగా వాళ్లకి ఇబ్బందులు ఎదురుకాకూడదు. ఈ విషయాన్ని గురించి నేను .. రాజశేఖర్ గారు కలిసి మాట్లాడుకున్నాము” అని అన్నారు.
“నేను .. రాజశేఖర్ గారు చాలా కెరియర్ చూశాము. ఇక ఇప్పుడు పిల్లల వంతు .. మేము లేకుండా వాళ్లు చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది. అందువలన వాళ్ల కెరియర్ పై ఎక్కువగా దృష్టిపెట్టడం జరిగింది. ఈ మధ్య కాలంలో నేను కాస్త తక్కువగా మాట్లాడటం కూడా ఒక కారణం. అయితే ఇది భయపడటం మాత్రం కాదు. ఎవరికీ భయపడే స్వభావం కాదు నాది” అని చెప్పారు.
Spread the loveముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతకు నిలువెత్తు నిదర్శనం పట్టిసీమ ప్రాజెక్టు•2015 నుంచి ఇప్పటివరకు పట్టిసీమ ద్వారా రూ.50,000 కోట్ల సంపద సృష్టి జరిగింది.•’సూపర్ ఎల్నినో’ లోను అన్నదాతల ముఖాల్లో ఆనందానికి సియం […]
Spread the loveగోదావరి-కావేరి అనుసంధానంతో దక్షిణాదిలో అద్భుత ఫలితాలు కేంద్రం చొరవ, రాష్ట్రాల సమన్వయంతో నీటి కష్టాలకు చెక్ గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రత్యేక నిధులివ్వండి ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు […]