మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ రెండో షెడ్యూల్‌ను ఇటీవలె ప్రారంభించారు. ఈ సినిమా కోసం ఇండియాలోని స్టార్ క్యాస్ట్ అంతా రాబోతోంది. టాప్ టెక్నీషియన్స్ అంతా కూడా ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. అయితే ‘కన్నప్ప’ మూవీకి ఇండియన్ టాప్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా రంగంలోకి దిగాడు. ఈ సినిమాలోని పాటలకు ప్రభు దేవా కొరియోగ్రఫీ చేయబోతున్నారు. ఈ మేరకు న్యూజిలాండ్‌లో ప్రభుదేవాకు కన్నప్ప టీమ్ స్వాగతం పలికింది.
ప్రభుదేవా ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘కన్నప్ప’ సెట్స్‌లో జాయిన్ అయ్యాడు. అనేక పాటలకు కొరియోగ్రఫీని కంపోజ్ చేసే పనిలో ఉన్న ప్రభుదేవా రాకతో కన్నప్ప సినిమా మరో లెవెల్‌కు వెళ్లింది. ప్రభుదేవా కొరియోగ్రఫీ ఎలక్ట్రిఫైయింగ్ సినిమాటిక్ అనుభవాన్ని ఇస్తుంది. రెండో షెడ్యూల్ న్యూజిలాండ్‌లో ప్రారంభమైందని ‘కన్నప్ప’ మూవీ టీం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో సినిమాను షూట్ చేస్తున్నారు. విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్ తదితరులు నటిస్తున్నారు. ‘మహాభారతం’ సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద మోహన్ బాబు నిర్మిస్తున్నారు.
Spread the loveదుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర సహాయ మంత్రి విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారిని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ దర్శించుకున్నారు. ఈ […]
Spread the loveపెట్టుబడులకు స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పారిశ్రామిక వేత్తలకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం విశాఖ భాగస్వామ్య సదస్సుకు రావాలని ఆహ్వానం పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో […]
Spread the love పిల్లి పిల్లి మధ్య కోతి మాయం రూ. 30కోట్ల పందెం సొమ్ముతో మధ్యవర్తి మాయం.. బెట్టింగ్ రాయుళ్లులో కలవరం! భీమవరంలో పందెం రాయుళ్ళు గగ్గోలు పెడుతున్నారు. పందాలుకు మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి […]