టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తండ్రయ్యాడు. శర్వా తన 40వ పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అతని భార్య రక్షితా రెడ్డి పండంటి పాపకు జన్మనిచ్చారు. తన చిన్నారికి ‘లీలా దేవీ మైనేని’ అని నామకరణం చేసినట్లు ఆయన తెలిపారు. కాగా, శర్వానంద్, రక్షితారెడ్డి జంటకు 2023 జూన్‌లో వివాహమైన విషయం తెలిసిందే. శర్వా భార్య హైకోర్టు న్యాయవాది కూతురు.
ఇక శర్వానంద్ ఇవాళ తన బర్త్‌డే సందర్భంగా తాను నటిస్తున్న మూడు కొత్త సినిమాల అప్‌డేట్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. వాటిలో ఒకటి చివరి షెడ్యూల్‌లో ఉండగా.. మరో రెండు సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాయి. ఇక ఈ మూడు సినిమాల్లో కూడా శర్వానంద్ మూడు డిఫరెంట్ రోల్స్‌లో కనిపించనున్నారు. శర్వా తన 35వ సినిమాని టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతో చేస్తున్నాడు. ఈ మూవీలో ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకి ‘మనమే’ అనే క్లాసీ టైటిల్‌ను ఖరారు చేశారు.
ఇక అతని 36వ చిత్రం యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కనుంది. ఈ మూవీకి అభిలాష్ రెడ్డి కంకర దర్శకుడు. ఇందులో శర్వా సరసన మాళవిక నాయర్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే 37వ ప్రాజెక్ట్‌ని ‘సామజవరగమన’ డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో చేయబోతున్నారు.
Spread the love ప్రతిక్షణం ప్రజల కోసం ప్రతి అడుగు పెనమలూరు నియోజకవర్గం అభివృద్ధి వైపు ఉయ్యూరు పట్టణంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న జోగి రమేష్ ఉయ్యూరు ఈ రోజు(07/05)న పట్టణంలో ఎన్నికల ప్రచార […]
Spread the love గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న “శ్రీమతి జోగి శకుంతలా దేవి ఉయ్యూరు ఈ రోజు(02/05)న పట్టణంలోని 8వ వార్డులో ఇళ్లను సందర్శిస్తూ ” గడప గడపకు వైయస్సార్ […]
Spread the love 61వ డివిజన్ శాంతినగర్ శాసనసభ్యులు,టిడిపి పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు సంబంధిత అధికారులతో కలిసి విచ్చేసి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగినది ది.23-07-2024 ఈరోజు అనగా మంగళవారం […]