టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తండ్రయ్యాడు. శర్వా తన 40వ పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అతని భార్య రక్షితా రెడ్డి పండంటి పాపకు జన్మనిచ్చారు. తన చిన్నారికి ‘లీలా దేవీ మైనేని’ అని నామకరణం చేసినట్లు ఆయన తెలిపారు. కాగా, శర్వానంద్, రక్షితారెడ్డి జంటకు 2023 జూన్‌లో వివాహమైన విషయం తెలిసిందే. శర్వా భార్య హైకోర్టు న్యాయవాది కూతురు.
ఇక శర్వానంద్ ఇవాళ తన బర్త్‌డే సందర్భంగా తాను నటిస్తున్న మూడు కొత్త సినిమాల అప్డేట్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. వాటిలో ఒకటి చివరి షెడ్యూల్లో ఉండగా.. మరో రెండు సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాయి. ఇక ఈ మూడు సినిమాల్లో కూడా శర్వానంద్ మూడు డిఫరెంట్ రోల్స్‌లో కనిపించనున్నారు. శర్వా తన 35వ సినిమాని టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతో చేస్తున్నాడు. ఈ మూవీలో ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాకి ‘మనమే’ అనే క్లాసీ టైటిల్‌ను ఖరారు చేశారు.
ఇక అతని 36వ చిత్రం యూవీ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కనుంది. ఈ మూవీకి అభిలాష్ రెడ్డి కంకర దర్శకుడు. ఇందులో శర్వా సరసన మాళవిక నాయర్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే 37వ ప్రాజెక్ట్‌ని ‘సామజవరగమన’ డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో చేయబోతున్నారు.
Spread the loveగన్నవరం విమానాశ్రయానికి పునర్ వైభవం : యార్లగడ్డగన్నవరం :తమ కూటమి ప్రభుత్వ చొరవతో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి పునర్వైభవం వచ్చిందని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గన్నవరం […]
Spread the love ధర్మశాల టెస్టులో తొలి రోజు బంతితో వీరవిహారం చేసి ఇంగ్లిష్ బ్యాటర్ల నడ్డి విరిచిన భారత జట్టు.. రెండో రోజు బ్యాటింగులోనూ దుమ్మురేపుతోంది. కెప్టెన్ రోహిత్‌శర్మ, యువ ఆటగాడు శుభమన్‌గిల్ […]
Spread the love NTR జిల్లా / నందిగామ నియోజకవర్గం : ది.04-05-2024(శనివారం) లక్ష్మీపురం గుడిమెట్ల గ్రామాలలో. డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు కి జన హారతి ధర్మాన్ని గెలిపించండి మంచి కోసం కుటుంబమంతా […]