ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం నిందితుడు కోడికత్తి శ్రీను అలియాస్ జనిపల్లి శ్రీనివాసరావు రాజకీయ అరంగేట్రం చేశారు. గతరాత్రి ఆయన ‘జైభీమ్ భారత్’ పార్టీలో చేరారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీనివాసరావు అమలాపురం నుంచి పోటీచేసే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ తాను పేదల కోసమే రాజకీయాల్లోకి రావాలనుకున్నట్టు చెప్పారు. కులం కోసమో, మతం కోసం తాను ఈ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. చట్టసభల్లో అడుగుపెట్టి పేదల సమస్యలు తీర్చాలని భావించి రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. జగన్ ప్రభుత్వంలో దగాపడిన శ్రీనివాసరావు దళిత, రాజ్యాంగ రక్షణ కోసం తపన పడుతున్నారని పార్టీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ చెప్పారు. పులివెందుల నుంచి తమ పార్టీ తరపున జగన్‌పై దస్తగిరి పోటీ చేయబోతున్నట్టు తెలిపారు.
Spread the loveవిజయవాడ 11/10/2025 కలెక్టరేట్లో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం బహుభాషా ప్రావీణ్యుడు, స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యార్థులకు నిత్య స్ఫూర్తి అని […]
Spread the love సుజనాను 15వేల ఆధిక్యంతో గెలిపిస్తాం బీజేపీ నేత బుల్లా విజయవాడ పశ్చిమ నియోజక వర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిని 15 వేల మెజారిటీతో గెలిపించుకుంటామని బీజేపీ నేత బుల్లా విజయ […]
Spread the love బీజేపీలోకి భారీగా మైనారిటీలు సుజనాకు దుర్బేసుల హుస్సేన్ మద్దతు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దుర్బేసుల హుస్సేన్ నాయకత్వంలో భారీ సంఖ్యలో మైనారిటీలు బీజేపీ లో చేరారు. విజయవాడ పశ్చిమ నియోజక వర్గానికి […]