కాపు సామాజికవర్గానికి చెందిన వారంతా ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిలుపునిచ్చారు. కాపు నేత ముద్రగడ పద్మనాభంను తమ పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. ముద్రగడ అలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఉండవల్లిలో చంద్రబాబు ఇంటి ముందు నుంచి తన కారులో వెళ్తూ అక్కడ తన వాహనాన్ని ఆపారు. ఆ సమయంలో చంద్రబాబు, కేంద్రమంత్రి షెకావత్, జనసేనాని పవన్ కల్యాణ్ లు చర్చలు జరుపుతున్నారు. ఈ సమయంలో చంద్రబాబు ఇంటి ముందు పాల్ కాసేపు హల్ చల్ చేశారు. పాల్ రావాలి.. పాలన మారాలి అంటూ నినాదాలు చేశారు.
చంద్రబాబు నుంచి ప్రజలు కొత్తగా ఏమీ ఆశించడం లేదని పాల్ అన్నారు. ఇప్పటికే చంద్రబాబు పాలనను చూసిన ప్రజలు విసిగిపోయారని చెప్పారు. పవన్ కల్యాణ్ అధికారంలోకి రాకుండా చంద్రబాబు చేశారని విమర్శించారు. పాలన అంటే సినిమాలో డ్యాన్సులు చేయడం కాదని ఎద్దేవా చేశారు. కేంద్రలో అధికారంలో ఉన్న బీజేపీ పదేళ్లుగా ఏపీని మోసం చూస్తూనే ఉందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు బీజేపీకి బుద్ధి చెపుతారని అన్నారు. సినీ నటుడు, సీనియర్ లీడర్ బాబూ మోహన్ కూడా తమ పార్టీలో చేరారని… మరింత మంది కీలక నేతలు తమ పార్టీలో చేరాలని ఆయన కోరారు.
Spread the love వైసీపీమేనిఫెస్టో.చిత్తుకాగితంజగన్ కు ప్రజలే గుణపాఠం చెప్తారుకూటమితోనే అభివృద్ధిపశ్చిమ ఎన్నికల ప్రచారంలో సుజనా చౌదరి అమరావతిని అణగదొక్కి ఏపీ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించిన వైసీపీకి ఎన్నికల్లో ఓటుతోనే బుద్ధి చెప్పాలని పశ్చిమ […]
Spread the love జయవాడ, 20 – 11 – 2025 విజయవాడలోని కాలేశ్వర రావు మార్కెట్ వద్ద గల ఏపీ వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ […]