హైదరాబాద్‌లోని వెంగళరావునగర్‌లో బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ దేదీప్యారావు, ఆమె భర్తపై గతరాత్రి కొందరు గుర్తు తెలియని మహిళలు దాడిచేశారు. కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ఇంటి బయట ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్)ను ఆమె ఆదేశించడమే ఈ గొడవకు కారణంగా తెలుస్తోంది.
కాంగ్రెస్ నేత మద్దతుదారులైన మహిళలు వెంగళరావునగర్ చేరుకుని ఆమెతో వాగ్వివాదానికి దిగారు. అప్రమత్తమైన దేదీప్యారావు మద్దతుదారులు అక్కడకు చేరుకోవడంతో గొడవ మరింత ముదిరి ఇరు వర్గాలు భౌతికదాడికి దిగాయి. ఈ గొడవతో కారు నుంచి కిందకు దిగిన కార్పొరేటర్‌పైనా మహిళలు దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Spread the love ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలలో ప్రతిక్షణం ,ప్రత్యక్ష వార్తలను అందజేస్తున్న ఏకైక ఛానల్ V V B9 న్యూస్ ఛానల్ వీక్షించండి .లైక్ చేయండి, షేర్ చేయండి ,సబ్‌స్క్రైబ్ […]
Spread the love కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ లోక్ సభ అభ్యర్థి దానం నాగేందర్‌పై సొంత పార్టీ నేత రాజుయాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా […]
Spread the love *ప్రతిక్షణం ప్రత్యక్ష వార్తలను ఎప్పటికప్పుడు అందజేస్తున్న V V B9 న్యూస్ ఛానల్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్‌స్క్రైబ్ చేయండి. మీ ప్రాంతంలోనే మరిన్ని వార్తలు కొరకు […]