హైదరాబాద్లోని వెంగళరావునగర్లో బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ దేదీప్యారావు, ఆమె భర్తపై గతరాత్రి కొందరు గుర్తు తెలియని మహిళలు దాడిచేశారు. కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ఇంటి బయట ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్)ను ఆమె ఆదేశించడమే ఈ గొడవకు కారణంగా తెలుస్తోంది.
కాంగ్రెస్ నేత మద్దతుదారులైన మహిళలు వెంగళరావునగర్ చేరుకుని ఆమెతో వాగ్వివాదానికి దిగారు. అప్రమత్తమైన దేదీప్యారావు మద్దతుదారులు అక్కడకు చేరుకోవడంతో గొడవ మరింత ముదిరి ఇరు వర్గాలు భౌతికదాడికి దిగాయి. ఈ గొడవతో కారు నుంచి కిందకు దిగిన కార్పొరేటర్పైనా మహిళలు దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Spread the love లోక్సభ ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున వలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలింది. వరంగల్ లోక్సభ స్థానం పోటీ నుంచి వైదొలగుతున్నట్టు ఆ పార్టీ అభ్యర్థి […]
Spread the love బీఆర్ఎస్ పదేళ్లలో చెయ్యలేనివి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు నెలల్లో చేసి చూపించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా మీడియా […]