తెలుగుదేశం పార్టీ మహిళల అభ్యున్నతి కోసం కొత్తగా ‘కలలకు రెక్కలు’ పథకం తీసుకువచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, చదవుకోవాలనుకునే అమ్మాయిలకు ఆర్థికపరిస్థితులు అడ్డంకిగా మారరాదని అన్నారు. అలాంటి వారు ఇంటికే పరిమితం కాకుండా, వారికి బ్యాంక్ లోన్లు ఇప్పించే కార్యక్రమమే కలలకు రెక్కలు పథకం అని వివరించారు.
ఇంటర్ విద్య పూర్తి చేసుకున్న అమ్మాయిలు ఉన్నత చదువులకు వెళ్లాలనుకుంటే, వారికి బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని, ఆ రుణాలకు ప్రభుత్వమే ష్యూరిటీ ఇస్తుందని చంద్రబాబు తెలిపారు. ఆ రుణంపై వడ్డీ కూడా ప్రభుత్వమే భరించేలా కలలకు రెక్కలు పథకానికి రూపకల్పన చేశామని చెప్పారు.
ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే ఆడపిల్లలు కలలకు రెక్కలు పథకం వెబ్ సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు.
Spread the love 11-05-2024 మైనారిటీలను ఓట్లు అడిగేహక్కు మైనారిటీలను నమ్మించిమొసం చేసిన జగన్ ప్రభుత్వానికి లేదు గౌస్ భాషా మైనారిటీ కార్పొరేషన్ ను దుర్వినియోగం చేసి మైనారిటీల నోరుకొట్టిన వ్యక్తులే మైనారిటీ నుంచి […]
Spread the loveఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ. డిజిటల్ అరెస్టులు, సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా సైబర్ సురక్షా కార్యక్రమం. *సరికొత్త కార్యక్రమానికి నాంది వేసిన నగర పోలీస్ కమిషనర్ […]
Spread the love ఎన్టీఆర్ జిల్లా, మే 12, 2024 జిల్లాలో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి ఓటు హక్కును వినియోగించుకోనున్న 17.04 లక్షల మంది ఓటర్లు 13,402 ఎన్నికల అధికారులు, సిబ్బందితో పోలింగ్ […]