వైసీపీకి గుడ్ బై చెప్పిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ నేడు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ నాయకత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.
ఈసారి ఎన్నికల్లో తనకు ఎంపీ టికెట్ కాకుండా, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామనే ప్రతిపాదన చేశారని వెల్లడించారు. వైసీపీలో ఉండి రూ.5 కోట్లు లేదా రూ.10 కోట్లు ఇస్తే ఎమ్మిగనూరు టికెట్ ఇస్తామని చెప్పారని వివరించారు. తనకు, సిట్టింగ్ ఎమ్మెల్యే (చెన్నకేశవరెడ్డి)కి మధ్య డబ్బు పోటీ పెట్టారని ఆరోపించారు.
అయితే, నా వద్ద అంత డబ్బు లేదని చెప్పి గౌరవంగా తప్పుకున్నానని సంజీవ్ కుమార్ తెలిపారు. మరి ఎమ్మిగనూరు వైసీపీ టికెట్ దక్కించుకున్న బుట్టా రేణుక ఎంత సమర్పించారో తనకు తెలియదని అన్నారు.
బీసీలకు బీసీలకు మధ్య, ఎస్సీలకు ఎస్సీలకు మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని సంజీవ్ కుమార్ విమర్శించారు. గొడవలు సృష్టించే విచ్ఛిన్నకర రాజకీయాలు వైసీపీలో చూశానని వెల్లడించారు.
Spread the love పిఠాపురంలో ఎస్.ఎల్.ఆర్.ఎం. ప్రాజెక్టుకు శ్రీకారం ప్రాజెక్టును ప్రారంభించిన శాసనమండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ ‘వ్యర్థాలను సక్రమ పద్ధతిలో వినియోగించగలిగితే గ్రామాల పరిశుభ్రతతో పాటు పంచాయతీలకు సిరుల పంట పండించవచ్చ’ని జనసేన పార్టీ […]
Spread the love ఎస్సీ. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు విడుదల చేయాలి. దళిత బహుజన పార్టీ DBP డిమాండ్.ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ. ఎస్టీ సామాజిక వర్గాల అభివృద్ధి కి ఉద్దెశించిన ప్రత్యేక బడ్జెట్ 22 […]
Spread the love *హైదరాబాద్* *తేది:* 10-08-2024 శనివారం ఎన్టీఆర్ భవన్కు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు మాన్య నారా చంద్రబాబు నాయుడు విచ్చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్య […]