వైసీపీకి గుడ్ బై చెప్పిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ నేడు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ నాయకత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.
ఈసారి ఎన్నికల్లో తనకు ఎంపీ టికెట్ కాకుండా, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామనే ప్రతిపాదన చేశారని వెల్లడించారు. వైసీపీలో ఉండి రూ.5 కోట్లు లేదా రూ.10 కోట్లు ఇస్తే ఎమ్మిగనూరు టికెట్ ఇస్తామని చెప్పారని వివరించారు. తనకు, సిట్టింగ్ ఎమ్మెల్యే (చెన్నకేశవరెడ్డి)కి మధ్య డబ్బు పోటీ పెట్టారని ఆరోపించారు.
అయితే, నా వద్ద అంత డబ్బు లేదని చెప్పి గౌరవంగా తప్పుకున్నానని సంజీవ్ కుమార్ తెలిపారు. మరి ఎమ్మిగనూరు వైసీపీ టికెట్ దక్కించుకున్న బుట్టా రేణుక ఎంత సమర్పించారో తనకు తెలియదని అన్నారు.
బీసీలకు బీసీలకు మధ్య, ఎస్సీలకు ఎస్సీలకు మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని సంజీవ్ కుమార్ విమర్శించారు. గొడవలు సృష్టించే విచ్ఛిన్నకర రాజకీయాలు వైసీపీలో చూశానని వెల్లడించారు.
Spread the love 23-6-2024 ది:23-6-2024 ఆదివారం ఈ రోజు ఉదయం బందర్ రోడ్డు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద నుండి నిర్వహించిన ఒలంపిక్ డే రన్* కార్యక్రమాన్నికి ముఖ్య అతిథిగా హాజరై 38వ ఒలంపిక్ రన్ […]
Spread the love తిరుపతి, 21-9-2024, శనివారం. ఒక ప్రాంతీయ పార్టీ తమ ఆర్థిక ప్రయోజనాల కొరకు తిరుమల లడ్డును వాడుకుంది. మరో ప్రాంతీయ పార్టీ శ్రీవారి లడ్డును రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోంది. తిరుమల […]
Spread the love పత్రిక ప్రకటన 297 కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి-రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి కొలుసు పార్థసారథి *అగిరిపల్లి మండలంలో రూ. 35.10 లక్షలతో నిర్మించనున్న రోడ్లకు శంఖుస్థాపన […]