జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతారనే సస్పెన్స్‌కు తెరపడింది. పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్టు ఆయన గురువారం స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని ఆయన స్పష్టతనిచ్చారు. ఈ మేరకు జనసేన సోషల్ మీడియా సమావేశంలో పవన్ అధికారికంగా ప్రకటించారు.
2014లో పార్టీ స్థాపించగానే పిఠాపురం నుంచి చేయమని అడిగారని ఆయన వెల్లడించారు. తెలంగాణ నుంచి, పిఠాపురం నుంచి పోటీ చేయమంటూ తనకు వినతులు వచ్చాయని అన్నారు. అయితే రాష్ట్రం కోసం ఆలోచించి అప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేయలేకపోయానని అన్నారు. నిజం చెప్పాలంటే, ఎన్నికల గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని, అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నిలబడదామనుకున్నానని, అందుకే 2014లో పార్టీ ఆఫీస్‌ను అక్కడి నుంచి ప్రారంభించానని అన్నారు. కాగా గత ఎన్నికల్లో పవన్ భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేసి, రెండు చోట్లా పరాజయం పాలైన విషయం తెలిసిందే.
Spread the love ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం శాసనసభ్యులు సుజన చౌదరి రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ […]
Spread the love 39 వ డివిజన్లో కల్వర్టు పనులు ప్రజా సమస్యలపై దృష్టి సారించిన పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ జూన్ 28. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పై […]
Spread the love డివిజన్ల అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు పశ్చిమ లోని రోడ్లు డ్రెయిన్లు తాగునీటి కుళాయిలను ఆధునికరించి అభివృద్ధి చేసే బాధ్యత ను తీసుకుంటామని పశ్చిమ నియోజకవర్గ […]