ఎలాంటి సపోర్ట్ లేకుండా సినిమా పరిశ్రమలోకి వచ్చి, టాప్ హీరో స్థాయికి ఎదగడం అంటే మాములు విషయం కాదు. ఇలా కేవలం తన స్వయంకృషితో టాలీవుడ్ స్టార్ హీరో అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. కోట్లాది మంది అభిమానగణం చిరు సొంతం. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే ఎంతోమందికి ఆయన రోల్ మోడల్. తనదైన డ్యాన్స్, నటనతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటు ప్రత్యేక ముద్ర వేసుకున్నారాయన. అలాగే సమాజసేవలోనూ చిరు తనవంతు సాయం చేస్తున్నారు. ఇటీవల పద్మ విభూషణ్ అవార్డు కూడా అందుకున్నారు. 70 ఏళ్లకు దగ్గర పడుతున్నా.. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీపడి చిరంజీవి సినిమాలు చేస్తున్నారు.
అయితే, తాజాగా మెగాస్టార్ 10వ తరగతి సర్టిఫికేట్ తాలూకు ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సర్టిఫికేట్‌లో చిరంజీవి పేరు కేఎస్ఎస్ వరప్రసాద్ రావు అని, తండ్రి పేరు వెంకట్ రావు అని ఉంది. చిరు పెనుగొండలో పుట్టినట్లు ఇందులో పేర్కొనడం జరిగింది. ఇప్పుడీ సర్టిఫికేట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో మెగాస్టార్ అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
ఇక చిరు ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్వకత్వంలో విశ్వంభర అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన సీనియర్ నటి త్రిషా హీరోయిన్‌గా చేస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేస్తామని ఇప్పటికే మూవీ యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Spread the love దాచేపల్లి గురజాల మండలాల పరిధిలో అడ్డగోలుగా రేషన్ బియ్యం మాఫియా ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన అంతా మా ఇష్టం అంటున్న దళారి పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం గురజాల దాచేపల్లి […]
Spread the love 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలపై ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. అప్పుడు జరిగిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను రద్దు చేసింది. వివరాల్లోకి వెళ్తే… మెయిన్స్ జవాబు పత్రాలను […]
Spread the love చంద్రబాబును రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు- మంచుకొండ చక్రవర్తి చంద్రబాబు మోసపూరిత హామీలు రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి […]