బాలీవుడ్ నటి, బీజేపీ లోక్ సభ అభ్యర్థి కంగనా రనౌత్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్ కు షాక్ తగిలింది. ఆమెను లోక్ సభ అభ్యర్థుల జాబితా నుంచి పార్టీ హైకమాండ్ తొలగించింది. కంగనకు హిమాచల్ ప్రదేశ్ లోని మండి ఎంపీ టికెట్ ను బీజేపీ కేటాయించింది. ఈ నేపథ్యంలో కంగనను ఉద్దేశించి సోషల్ మీడియాలో సుప్రియా అనుచిత కామెంట్ చేశారు. కంగన బ్రా ధరించి ఉన్న ఫొటోను షేర్ చేసింది.
దీనిపై కంగన ఘాటుగా స్పందించింది. సెక్స్ వర్కర్ల దుర్భర జీవితాను ప్రస్తావిస్తూ… ఇతరులను దూషించడం మానుకోవాలని అన్నారు. మరోవైపు, ఆ పోస్టు తాను చేయలేదని… తన ఇన్స్టా, ఫేస్ బుక్ యాక్సెస్ యాక్సెస్ చాలా మంది వద్ద ఉందని తెలిపింది. ఈ వివాదం నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సుప్రియకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. శుక్రవారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సుప్రియ చేసిన వ్యాఖ్యలు హుందాగా లేదని వ్యాఖ్యానించింది. ఇతర పార్టీల నేతలు, కార్యకర్తల జీవితాల గురించి ఎలాంటి విమర్శలు చేయవద్దని హెచ్చరించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రియపై కాంగ్రెస్ హైకమాండ్ చర్యలు తీసుకుంది. లోక్ సభ అభ్యర్థుల జాబితాలో ఆమె పేరును పక్కన పెట్టింది. 2019లో ఉత్తరప్రదేశ్ లోని మహరాజ్ గంజ్ నుంచి సుప్రియ పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పడు ఆమెను ఆ స్థానం నుంచి తప్పించి వీరేంద్ర చౌదని పేరును కాంగ్రెస్ ప్రకటించింది.
Spread the love సైనికుడిలా పనిచేస్తా.ఆశీర్వదించండి-సుజనా చౌదరి ప్రజలు ఆశీర్వదిస్తే సైనికుడిలా పని చేసి విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువస్తానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. మండల బీజేపీ అధ్యక్షుడు కంచంపల్లి […]
Spread the love విజయవాడ ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ సతీమణి శ్రీ వాణి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, వెల్లంపల్లి శ్రీనివాసరావు , వారి కుటుంబ సభ్యులతో కలిసి, […]