నేడు కోల్‌కతా ప్రధాన న్యాయస్థానం చారిత్రాత్మక నిర్ణయంతో, ముస్లింలకు ఇచ్చిన
వెనుకబడిన తరగతుల రిజర్వేషన్‌ను రద్దు చేసింది. మరియు 2010 నుండి ఇచ్చిన సర్టిఫికేట్‌ను కూడా రద్దు చేసింది.
ఈ నిర్ణయాన్ని అంగీకరించబోమని, అమలు చేయబోమని శ్రీమతి మమతా బెనర్జీ ప్రకటన ఇచ్చినది.
మన బిసి సమాజం గ్రహించవలసిన అంశం ఇది. కేవలం వారి ఓటు బ్యాంకు కోసం బిసి రిజర్వేషన్లు ముస్లిం లకు ఇస్తూ బిసి అభివృద్ధిని నిర్వీర్యం చేశారు. మమత బెనర్జీ పెద్ద యెత్తున ముస్లిం లకు ఒబిసి రిజర్వేషన్లు ఇచ్చారు. ఈ ఆలోచన కేవలం ఓటు బ్యాంకు కోసం మాత్రమే చేస్తున్నారు. ముస్లిం లకు బిసి రిజర్వేషన్లు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నారు.
అయితే ఈ రోజు కలకత్తా న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మమతా బెనర్జీకి మరియు కాంగ్రెస్కి పార్టీకి చెంపపెట్టులాంటిది.
ముస్లిం లకు 5లక్షల ఒబిసి సర్టిఫికెట్ లను మమత బెనర్జీ ఇచ్చినది.
పేదరికం నిర్మూలన అభివృద్ధి ఆధారంగా చేయవలసిన రిజర్వేషన్ నిర్ణయాలు కేవలం వారి ఓటు బ్యాంకు కోసం బుజ్జగింపు రాజకీయాలతో మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం మరియు బిసిలకు అన్యాయం చేసేవిధంగా ముస్లింలకు రిజర్వేషన్లు చేసిన మమత ప్రభుత్వానికి కలకత్తా ప్రధాన న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ద్వారా మమతకి తగిన బుద్ధి చెప్పింది.
కోల్‌కతా ప్రధాన న్యాయస్థానం ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుని భారతీయ జనతా ఒబిసి మోర్చా స్వాగతిస్తున్నది.
ఈ నిర్ణయాన్ని అంగీకరించబోమని, అమలు చేయబోమని మమతా బెనర్జీ ప్రకటన చేయడం భారత న్యాయస్థానాలపై వారికున్న గౌరవాన్ని అహంకారాన్ని తెలియచేస్తుంది.
ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్న వారు
బలివాడ శివకుమార్ పట్నాయక్
రాష్ట్ర కోశాధికారి
ఒబిసి మోర్చా, ఆంధ్రప్రదేశ్
చిన్ని చిట్టిబాబు ఎన్టీఆర్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు
కర్రీ రాఘవ ఓబీసీ మోర్చా స్టేట్ విశ్వకర్మ యోజన కన్వీనర్
మానేపల్లి మల్లేశ్వరరావు ఓబీసీ మోర్చా రాష్ట్ర మీడియా సెల్ కన్వీనర్
కిలారి శ్రీనివాసరావు ఎన్టీఆర్ జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి
Spread the love ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న నల్లమిల్లి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కుటుంబం తిరుపతిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ వేంకటేశ్వర స్వామి […]
Spread the love జర్నలిస్టుల సంక్షేమానికి నా సహకారం ఎప్పుడూ ఉంటుంది సమాజంలో పత్రిక రంగాన్ని కొందరు దిగజారుస్తున్నారు యాజమాన్యాలతో పని లేకుండా సొంతగా ఛానల్స్ పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మైలవరం ఎమ్మెల్యే వసంత […]
Spread the love 26-06-2024 లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కి శుభాకాంక్షలు తెలిపిన ఎంపి కేశినేని శివనాథ్ చిన్ని ఢిల్లీ : పార్లమెంట్ లో బుధవారం 18వ లోక్ సభకి జరిగిన స్పీకర్ […]