నేడు కోల్‌కతా ప్రధాన న్యాయస్థానం చారిత్రాత్మక నిర్ణయంతో, ముస్లింలకు ఇచ్చిన
వెనుకబడిన తరగతుల రిజర్వేషన్‌ను రద్దు చేసింది. మరియు 2010 నుండి ఇచ్చిన సర్టిఫికేట్‌ను కూడా రద్దు చేసింది.
ఈ నిర్ణయాన్ని అంగీకరించబోమని, అమలు చేయబోమని శ్రీమతి మమతా బెనర్జీ ప్రకటన ఇచ్చినది.
మన బిసి సమాజం గ్రహించవలసిన అంశం ఇది. కేవలం వారి ఓటు బ్యాంకు కోసం బిసి రిజర్వేషన్లు ముస్లిం లకు ఇస్తూ బిసి అభివృద్ధిని నిర్వీర్యం చేశారు. మమత బెనర్జీ పెద్ద యెత్తున ముస్లిం లకు ఒబిసి రిజర్వేషన్లు ఇచ్చారు. ఈ ఆలోచన కేవలం ఓటు బ్యాంకు కోసం మాత్రమే చేస్తున్నారు. ముస్లిం లకు బిసి రిజర్వేషన్లు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నారు.
అయితే ఈ రోజు కలకత్తా న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మమతా బెనర్జీకి మరియు కాంగ్రెస్‌కి పార్టీకి చెంపపెట్టులాంటిది.
ముస్లిం లకు 5లక్షల ఒబిసి సర్టిఫికెట్ లను మమత బెనర్జీ ఇచ్చినది.
పేదరికం నిర్మూలన అభివృద్ధి ఆధారంగా చేయవలసిన రిజర్వేషన్ నిర్ణయాలు కేవలం వారి ఓటు బ్యాంకు కోసం బుజ్జగింపు రాజకీయాలతో మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం మరియు బిసిలకు అన్యాయం చేసేవిధంగా ముస్లింలకు రిజర్వేషన్లు చేసిన మమత ప్రభుత్వానికి కలకత్తా ప్రధాన న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ద్వారా మమతకి తగిన బుద్ధి చెప్పింది.
కోల్‌కతా ప్రధాన న్యాయస్థానం ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుని భారతీయ జనతా ఒబిసి మోర్చా స్వాగతిస్తున్నది.
ఈ నిర్ణయాన్ని అంగీకరించబోమని, అమలు చేయబోమని మమతా బెనర్జీ ప్రకటన చేయడం భారత న్యాయస్థానాలపై వారికున్న గౌరవాన్ని అహంకారాన్ని తెలియచేస్తుంది.
ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్న వారు
బలివాడ శివకుమార్ పట్నాయక్
రాష్ట్ర కోశాధికారి
ఒబిసి మోర్చా, ఆంధ్రప్రదేశ్
చిన్ని చిట్టిబాబు ఎన్టీఆర్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు
కర్రీ రాఘవ ఓబీసీ మోర్చా స్టేట్ విశ్వకర్మ యోజన కన్వీనర్
మానేపల్లి మల్లేశ్వరరావు ఓబీసీ మోర్చా రాష్ట్ర మీడియా సెల్ కన్వీనర్
కిలారి శ్రీనివాసరావు ఎన్టీఆర్ జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి
Spread the love దేశంలోనే బెస్ట్ హాస్పిటల్స్ గా సర్కారు దవాఖానాలను తీర్చిదిద్దండి సీఎం చంద్రబాబు మంత్రి సత్య కుమార్ యాదవ్ వైద్య ఆరోగ్య శాఖలో ఉత్తమ విధానాలు అమలు చేయండి టెలి మెడిసిన్ ద్వారా […]
Spread the love ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా, రోల్ మోడల్ గా, సుజనా చౌదరి పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి నియోజవర్గంలో అందరికీ ఆరోగ్యమనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల ముందు పశ్చిమ ప్రజలకు ఇచ్చిన […]
Spread the love ఇంద్రకీలాద్రి మీడియా పాయింటు 04-10-2024 —– —- సామాన్య భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం కల్పిస్తున్నాం… — ఏర్పాట్లపై నిరంతర పర్యవేక్షణ…. — లోటుపాట్లను సవరించి సంతృప్తికరమైన దర్శన భాగ్యం… — […]