తెదేపా నేత పిడపర్తి పిచ్చిరెడ్డి ఆకస్మిక మృతి పార్టీకి తీరనిలోటు

Spread the love

 తెదేపా నేత పిడపర్తి పిచ్చిరెడ్డి  ఆకస్మిక మృతి పార్టీకి తీరనిలోటు

.

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు 

ఎంపీ తో కలసి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు.

ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం, 19.08.2024.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పిడపర్తి పిచ్చిరెడ్డి  ఆకస్మిక మృతి పార్టీకి తీరనిలోటని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు  వ్యాఖ్యానించారు. 

రెడ్డిగూడెం మండలం నరుకుళ్ళపాడు పంచాయతీ ఓబులాపురం గ్రామానికి చెందిన పిచ్చిరెడ్డి  ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

ఈ విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కృష్ణప్రసాదు , విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) తో కలసి ఓబులాపురంలోని వారి నివాసానికి విచ్చేసి పిచ్చిరెడ్డి  కుటుంబ సభ్యులను పరామర్శించారు.

రెడ్డిగూడెం మండలంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం ఆయన విస్తృతంగా సేవలు అందించారని పేర్కొన్నారు. పిచ్చిరెడ్డి  పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధించారు. ఆయన ఆకస్మిక మృతి వార్త తనను ఎంతగానో కలచివేసిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. స్థానిక ఎన్డీఏ మహాకూటమి నాయకులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *