Home Political news ACB కార్యాలయం వద్ద పంజరంతో వినూత్నంగా APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ప్రెస్ మీట్

ACB కార్యాలయం వద్ద పంజరంతో వినూత్నంగా APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ప్రెస్ మీట్

3
0

 విజయవాడ

ACB కార్యాలయం వద్ద పంజరంతో వినూత్నంగా APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ప్రెస్ మీట్

ACB వ్యవస్థను కూటమి ప్రభుత్వం పంజరం లో పెట్టింది – వైఎస్ షర్మిలా రెడ్డి

పం

జరం నుంచి ACB నీ విడుదల చేయండి – వైఎస్ షర్మిలా రెడ్డి

*అదానీ – జగన్ 1750 కోట్ల ముడుపుల పై వెంటనే ACB దర్యాప్తు జరిపించాలి – వైఎస్ షర్మిలా రెడ్డి*

*అనాడు అదానీ డీల్ పై కోర్టును ఆశ్రయించిన TDP ఇప్పుడెందుకు మౌనం పాటిస్తోంది – వైఎస్ షర్మిలా రెడ్డి*

*వైఎస్ షర్మిలా రెడ్డి*

APCC చీఫ్

– అదానీ పై అమెరికాలో దర్యాప్తు జరుగుతుంది

– సోలార్ పవర్ డీల్ లో జగన్ కి 1750 కోట్లు ముడుపులు ఇచ్చారని వెల్లడి అయ్యింది

– ఈ విషయాన్ని అమెరికా FBI వెల్లడించింది

– ఆధారాలు కూడా బయట పెట్టింది

– ఇంత జరుగుతుంటే మన దర్యాప్తు సంస్థలు నిద్ర పోతున్నాయా ?

– ఇంత అవినీతి జరిగితే మన రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలు ఎందుకు బయటపెట్టలేదు ?

– 2021 లో ప్రతిపక్షంలో ఉన్న TDP ఈ సోలార్ డీల్ పై హైకోర్టు లో పిటీషన్ కూడా వేశారు

– ఇదొక కుంభకోణం అని ఇప్పటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేశారు

– రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల ఆర్థిక భారం అని ఆరోపణ చేశారు

– అదానీ డీల్ వెనుక అవినీతి జరిగిందని తెలుసు

– ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు

– కోర్టు కేసు వేసిన పయ్యావుల మంత్రిగా అన్నారు

– అధికారం చేతుల్లో పెట్టుకొని ఏం చేస్తున్నారు?

– జగన్ కి నష్టం లేదు..మీకు నష్టం లేదు

– నష్టం జరిగేది రాష్ట్ర ప్రజలకు మాత్రమే

– అదానీ తో 25 ఏళ్ల ఒప్పందం అంటే రాష్ట్రం నెత్తిన అధికార భారం పడుతుంది

– ఒకప్పుడు సోలార్ పవర్ యూనిట్ కి 10 రూపాయలు ఉండేది

– ఇప్పుడు యూనిట్ ధర 1.99 పైసలకు తగ్గింది

– రేపు 50 పైసలకే వచ్చినా తగ్గొచ్చు

– సోలార్ పవర్ రెట్లు తగ్గుంటుంటే… మీరు ఎలా 25 ఏళ్లకు అగ్రిమెంట్ చేశారు ?

– 2.49 పైసలకు కొని రాష్ట్రం నెత్తిన లక్ష కోట్ల భారం ఎందుకు భారం మోపారు. 

– చంద్రబాబు ను అడుగుతున్నాం

– అదానీ మీద మీరు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు ?

– అదానీ అనే పేరు కూడా ఎందుకు ఉచ్ఛరించడం లేదు ?

– అదానీ బీజేపీ మనిషి..మోడీ మనిషి. బీజేపీ తో మీకు అలయెన్స్ ఉంది

– అందుకే మీరు అదానీ కి, మోడీ కి బయపడుతున్నారు

– అదానీ నీ కాపాడుతున్నారు

– రాహుల్ గాంధీ సైతం పార్లమెంట్ లో పోరాటం చేస్తున్నారు

– JPC వేయాలని డిమాండ్ చేస్తున్నారు

– అయినా మోడీనోరు విప్పడం లేదు

– మొత్తం దర్యాప్తు సంస్థలను గుప్పిట్లో పెట్టుకున్నారు

– అమెరికా దర్యాప్తు సంస్థలు చెప్తే కానీ అవినీతి బయటకు రాలేదు ?

– ఈ అవినీతి బయట పెట్టని CBI చేతకానిదా?

– మోడీ చేతకాని వాడా ?

– ఇవ్వాళ కాంగ్రెస్ పార్టీ ACB కి పిర్యాదు చేసింది

– దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేసింది

– ACB స్వయం ప్రతిపత్తి గల సంస్థ

– కానీ రాష్ట్రంలో ACB నీ బంది చేశారు.

– పంజరంలో చిలక మాదిరిగా బంధి చేశారు

– TDP పంజరంలో ACB బందీ అయ్యింది

– ACB నీ వెంటనే విడుదల చేయండి

– ఏసీబీ ప్రజల కోసం ఉన్న సంస్థ

– ఈ లంచాల వ్యవహారాన్ని ఏసీబీ బయట పెట్టాలి

– ఇప్పటికే రాష్ట్రం నెత్తిన విద్యుత్ చార్జీల భారం మోపారు

– ఈ డీల్ వల్ల 1.50 లక్షల కోట్ల భారం పడుతుంది

– చంద్రబాబు గారు..మీ రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టండి

– జగన్ తన సొంత ప్రయోజనం కోసం డీల్ చేస్తున్నారు

– ఆయనకు మీకు తేడా లేదు

– ప్రజలు కూటమి నీ నమ్మి రాత్రి 9 గంటల దాకా లైన్లో నిలబడి ఓట్లు వేశారు

– ప్రజల నమ్మకాన్ని నిలబెట్టండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here