సుజనా చౌదరి చొరవతో చిన్నారికి గుండె సర్జరీ.. కృతజ్ఞతలు తెలిపిన చిన్నారి తల్లి తండ్రులు..

5
0

 సుజనా చౌదరి చొరవతో చిన్నారికి గుండె సర్జరీ..

కృతజ్ఞతలు తెలిపిన చిన్నారి తల్లి తండ్రులు..

విజయవాడ పాత బస్తీ

51 వ డివిజన్ పరిధిలో అప్పల స్వామి వీధి కొండ ప్రాంతానికి చెందిన కె తేజస్విని కుమార్తె కులసాల రాజేశ్వరి 12 నెలల చిన్నారి పుట్టినప్పటినుంచి శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది. పడుతుంది. 

చిన్నారి కు గుండెలో హోల్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రైవేటు వైద్యానికి 

దాదాపు నాలుగు లక్షల రూ ఖర్చవుతుంది అని వైద్యులు తెలపుగా చిన్నారి తల్లిదండ్రులు ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయాన్ని సంప్రదించారు. 

ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద రూ 4 లక్షల విలువైన గుండె శస్త్ర చికిత్సను చేసేందుకు ఎన్నారై ఆసుపత్రి వైద్యులు ముందుకు వచ్చారు.. గుండె సమస్యతో బాధపడుతున్న ఏడాది వయస్సు ఉన్న చిన్నారికి ఎన్నారై హాస్పిటల్ వైద్యులు క్లిష్టమైన శస్త్ర చికిత్స చేసారు.. సర్జరీ విజయవంతం కావడంతో

చిన్నారి తల్లిదండ్రులు ఎమ్మెల్యే సుజనా కార్యాలయానికి వచ్చి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కు కృతజ్ఞతలు తెలిపారు. పేదలకు వైద్య సాయం అందించడంలో సహకరించిన సుజనా చౌదరి ఔదార్యాన్ని కొనియాడారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here