ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ అడ్డదారులు తొక్కుతోందని సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్ విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో తిరుపతిలో జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ 35 వేల దొంగ ఓట్లు వేయించిందని అన్నారు. దొంగ ఓట్లతో గెలిచి, భారీ మెజార్టీతో గెలిచామని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకున్నారని దుయ్యబట్టారు. అయితే, దొంగ ఓట్లు చేర్చిన వారికి డబ్బులు ఇవ్వక పోవడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చిందని చెప్పారు.
![]()

