కొలిచిన వారికి, నమ్మిన వారికి శ్రీవారు రక్షణగా నిలిచారు

Spread the love

• కొలిచిన వారికి, నమ్మిన వారికి శ్రీవారు రక్షణగా నిలిచారు.
• ప్రాణదానం కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజే నాపై అలిపిరిలో దాడి జరిగింది.
• చాలా పకడ్బందీగా నాపై దాడి జరిగినా… వెంకటేశ్వర స్వామి కృప వల్లే ఆ దాడిలో ఎవ్వరూ చనిపోలేదు.
• వెంకటేశ్వర స్వామే నాకు ప్రాణభిక్ష పెట్టారు… నాకు పునర్జన్మనిచ్చారు.
• ప్రపంచం మొత్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్లో విశ్వాసం పెంపోందించేలా కార్యక్రమాలు చేపడుతున్నారు.
• భక్తుల విరాళాలు, ఆదాయాన్ని వెల్లడించడం, భక్తులు ఇచ్చిన విరాళాలను వారి సౌకర్యాలు.. సేవలకే ఖర్చు పెడుతున్నారు.
• తిరుమల కొండ మీద పచ్చదనం విరాజిల్లుతోంది.
• దేవుని పవిత్రత కాపాడే విషయంలో రాజీ పడవద్దని టీటీడీకి విజ్ఞప్తి చేస్తున్నా.
• గో-సంరక్షణ, వేద పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలి… దీనికి టీటీడీ నాందీ పలకాలి.
• శ్రీవారి దేవాలయాన్ని ఆదర్శంగా… పవిత్రతకు మారుపేరుగా తీర్చిదిద్దాలి.
• శ్రీవారి సేవకులు చాలా భక్తి విశ్వాసంతో సేవలు అందిస్తున్నారు… వారిని మరింత ప్రొత్సహించాలి.
• ఎక్కడికక్కడ శ్రీవారి దేవాలయాలను నిర్మించాలి… ఆ దేవాలయాల్లో ప్రశాంత, పవిత్ర వాతావరణం ఉండాలి.
• దేశంలోని అన్ని రాజధానుల్లో శ్రీవారి దేవాలయాలను నిర్మిస్తాం.
• విదేశాల్లో కూడా హిందువులు ఎక్కువగా ఉన్న చోట వెంకటేశ్వర స్వామి దేవాలయాలను ఏర్పాటు చేస్తాం.
• టీటీడీ సహకారంతో రాష్ట్రంలో 5 వేల దేవాలయాల నిర్మాణాలు జరగబోతున్నాయి.
• దేవాలయం ఎక్కడ ఉంటే అక్కడ అన్న ప్రసాదం ఏర్పాటు చేస్తున్నాం.
• ప్రాణదానం ద్వారా వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటాం.
• విద్యా దానం కింద నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తాం… దీని కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తాం.
• వృక్షో గోవిందం పేరుతో ప్రకృతి పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపడతాం.
• తిరుమలలోనే కాకుండా ప్రతి ప్రాంతంలో వృక్షో గోవిందం నిర్వహించేలా చూస్తాం.
• ఎల్ నినో వంటి విపత్తులను తట్టుకోవాలంటే ప్రకృతిని పరిరక్షించేలా వృక్షో గోవిందం కార్యక్రమాలు అవసరం.
• తిరుమల సహా అన్ని ప్రాంతాలకు నీటి కొరత లేకుండా చర్యలు చేపడతాం.
• హంద్రీ-నీవా ద్వారా కళ్యాణి డ్యాంకు నీటి సరఫరా చేస్తాం.
• సోమశిల ద్వారా బాలాజీ రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తాం.
• భవిష్యత్తులో తిరుమలకు నీటి కొరత అనే ప్రశ్నే లేకుండా ప్రణాళికలు చేపట్టాం.
• ఈ ఏడాది కూడా ప్రత్యామ్నాయాల ద్వారా నీటి కొరతను అధిగమిస్తాం.
• 1999లో తిరుమలలో నీటి ఎద్దడి వచ్చింది… ఆనాడు 41 రోజుల్లో కళ్యాణి డ్యాం నుంచి పైప్ లైన్ వేసి నీటి ఎద్దడిని నివారించాం.
• అవసరమైతే తిరుమలకు రెండో పైప్ లైన్ వేస్తాం.
• దేవుని మీద భక్తి ఉండే ప్రతి ఒక్కరూ మానవ సేవే-మాధవ సేవ అని గుర్తు పెట్టుకోవాలి.
• సమాజ హితం కోసం పని చేసే ప్రతి ఒక్కరూ దేవునికి సన్నిహితంగా ఉంటారు.
• టీటీడీ అన్నం, విద్య, వైద్య దానాలకు సహకరిస్తోంది.
• భక్తుల మనోభావాలు పెంపోందించేలా… టెక్నాలజీని వినియోగించి చర్యలు చేపట్టారు.
• టీటీడీ ఉద్యోగులకు ఇంటి జాగాల సమస్యను పరిష్కరించాం.
• డబ్బు, సంపద, హోదా శాశ్వతం కాదు. ఆధ్యాత్మికత, ధర్మం అనేవి మనిషికి సంతోషాన్నిస్తాయి.
• చాలా మంది ఎంతో డబ్బులు సంపాదించారు… కానీ దాన్ని కొందరే సద్వినియోగం చేస్తారు… జైన్ దంపతులు ఆ కోవకే చెందుతారు.
• దేవుని సేవకు ముందుకు వచ్చిన జైన్ దంపతులను అభినందిస్తున్నాను.
• చాలా మంది బిలియనీర్స్, ట్రిలియనీర్స్ ఉన్నారు… కానీ జైన్ దంపతులు తమ సంపదను ఆధ్యాత్మిక సేవకు వినియోగించారు.
• జైన్ దంపతుల తరహాలోనే ధనవంతులు పేదల సంక్షేమం, సమాజ, ఆధ్యాత్మికత వంటి సేవా కార్యక్రమాలకు వెచ్చించాలని కోరుతున్నాను.
• వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రతి ఇంటా ఆరోగ్యం, సంపద, ఆనందం ఉండాలని కోరుకుంటున్నాను.
• భారతీయ సంస్కృతి చాలా గొప్పది, పవిత్రమైనది.
• వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రాష్ట్రం, దేశం మరింత అభివృద్ధి చెందడం ఖాయం.
• టెక్నాలజీ, నాలెడ్జీతో పాటు దేవుని కృప కూడా ఉండాలి.
• కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, ఆయనపై నమ్మకం, భక్తితో పని చేస్తున్నాం… రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి.

-తిరుమలలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

Loading