
మెరుగైన వైద్యం కోసం లబ్ధిదారులకు ఎల్ ఓ సీ పత్రాలు అందజేత
ఎమ్మెల్యే సుజనా చౌదరి సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన ఎల్ ఓ సీ లను భవానిపురం లోని ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ 51 వ డివిజన్ జనసేన పార్టీ కార్పొరేటర్ అబ్దుల్ అకీబ్ అర్షద్ , పలువురు కూటమి నాయకులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు
వించి పేటకు చెందిన షేక్ నాగుల్ మీరా (45) కు రూ 5.85 లక్షల ఎల్ వో సి, చిట్టినగర్ కు చెందిన రాంపిళ్ళ నితిన్ (6) కు రూ4.43 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు.
త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాదితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు
కూటమి నాయకులు కొట్టేటి హనుమంతరావు,
బీ దుర్గాప్రసాద్ దుర్బేసుల హుస్సేన్ , దొడ్ల రాజా తదితరులు పాల్గొన్నారు.
![]()
