బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులతో కలిసి హెల్మెట్ల పంపిణీ మరియు రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిదిగా పాల్గొన్న ఈస్ట్ జోన్ డి.సి.పి. కృష్ణ కాంత్ పటేల్ ఐ.పి.ఎస్.

Spread the love

బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులతో కలిసి హెల్మెట్ల పంపిణీ మరియు రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిదిగా పాల్గొన్న ఈస్ట్ జోన్ డి.సి.పి. కృష్ణ కాంత్ పటేల్ ఐ.పి.ఎస్.

నగరంలో రోడ్డు భద్రతను పెంపొందించడానికి మరియు రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు నగర పోలీస్ కమీషనర్  ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.  తీసుకొంటున్న చర్యలలో తమవంతు బాగంగా  విజయవాడలోని కేంబ్రిడ్జ్ మాంటిస్సోరి ప్రీ-స్కూల్ (Cambridge Montessori Pre-School) మరియు కెరీర్ వాక్ ఫౌండేషన్ (Career Walk Foundation) వారి సంయుక్త ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని  పురస్కరించుకుని  రామవరప్పాడు రింగ్ సెంటర్ సమీపంలో చిన్నారులతో ద్విచక్ర వాహనదారులకు ఉచిత హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ఈస్ట్ జోన్ డి.సి.పి.  కృష్ణ కాంత్ పటేల్ ఐ.పి.ఎస్. ముఖ్య అతిథిగా హాజరయ్యి చిన్నారులతో కలిసి ద్విచక్ర వాహనదారులకు ఉచిత హెల్మెట్లను  అందజేసి, సురక్షిత ప్రయాణంపై అవగాహన కల్పించారు. అనంతరం చిన్నారులకు బాలల దినోత్సవం సందర్బంగా చాక్లెట్స్ పంచిపెట్టారు.

ఈ సందర్బంగా డి.సి.పి.  మాట్లాడుతూ...... "ప్రతి వాహనదారుడు తమ కుటుంబ సభ్యుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత. చిన్నతనం నుండే పిల్లలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడం అభినందనీయం" అని పేర్కొన్నారు. సమాజ హితం కోసం ఇటువంటి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన కేంబ్రిడ్జ్ మాంటిస్సోరి ప్రీ-స్కూల్ మరియు కెరీర్ వాక్ ఫౌండేషన్ నిర్వాహకులను, ఉపాధ్యాయులను మరియు చిన్నారులను డి.సి.పి.  ప్రత్యేకంగా అభినందించారు.


ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డి.సి.పి.  కృష్ణ కాంత్ పటేల్ ఐ.పి.ఎస్. సెంట్రల్ ఎ.సి.పి.  దామోధర్ ఇన్స్పెక్టర్లు  పవన్ కిషోర్  రమేష్ కేంబ్రిడ్జ్ మాంటిస్సోరి ప్రీ-స్కూల్, కెరీర్ వాక్ ఫౌండేషన్ ప్రతినిధులు మరియు విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

Loading