పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం (నవంబర్ 15) విజయవాడలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

Spread the love

పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం (నవంబర్ 15) విజయవాడలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, జైకృష్ణ, గౌతమ్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్‌లోని సూపర్ స్టార్ కృష్ణ పార్కు వద్ద ఈ కార్యక్రమాలు జరిగాయి.ఈ సందర్భంగా పేదలకు పండ్లు, దుప్పట్లు, చీరల పంపిణీతో పాటు ఉచిత మెగా వైద్య శిబిరం, అన్నసమారాధన నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమాలు కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 60వ డివిజన్ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి, శ్రీ లక్ష్మీ ఫిలిమ్స్ బోస్ హాజరయి ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించి పేదలకు పండ్లు, దుప్పట్లు, చీరల పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ నటశేఖరుడిగా, సూపర్ స్టార్‌గా కృష్ణ. కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారన్నారు. కార్యక్రమ నిర్వాహకులు అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  కె. సుధాస్వామిని అభినందించారు. అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  కె. సుధాస్వామి మాట్లాడుతూ తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప నటుడు, దర్శకుడు, నిర్మాత, సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ. తెలుగు చిత్రసీమలో ఎన్నో సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టి, తనదైన నటన, విభిన్న కథాంశాలు, సాహసోపేతమైన చిత్రాలతో సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ట్రెండ్ సెట్టర్ అని అన్నారు. అన్నివిధాలా సహకరించిన కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి, శ్రీ లక్ష్మీ ఫిలిమ్స్ బోస్, మణిపాల్ హాస్పిటల్ డాక్టర్స్ , సిబండికి ధన్యవాదులు తెలిపారు  ఈ కార్యక్రమాన్ని సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Loading