
విశాఖపట్నం, నవంబర్ 12:
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విశాఖకు జాతీయ స్థాయిలో నంబర్ వన్ స్థానం
దేశవ్యాప్తంగా 60 అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఆరు అవార్డులు
వచ్చే ఏడాది 50 శాతం అవార్డులు సాధించడమే లక్ష్యం.. ప్రజల భాగస్వామ్యం అవసరం
- పురపాలక శాఖ మంత్రి పి నారాయణ
స్వచ్ఛ సర్వేక్షణ్ జాతీయ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరోసారి సత్తా చాటిందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు.
గురువారం స్థానిక సీఐ సమ్మిట్ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద విలేకరుల సమావేశంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఎం సురేష్ కుమార్ విశాఖపట్నం నగర పాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ లతో కలిసి విలేఖరుల సమావేశం లో మాట్లాడారు.
ఈ సందర్బంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఈ ఏడాది ప్రకటించిన 60 అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఆరు అవార్డులు రావడం గర్వకారణమని పేర్కొంది. ముఖ్యంగా మిలియన్ ప్లస్ జనాభా కలిగిన నగరాల విభాగంలో విశాఖపట్నం దేశంలోనే నంబర్ వన్ స్థానాన్ని సాధించడం విశేషమని తెలిపింది.
ఈ విజయానికి కృషి చేసిన విశాఖపట్నం నగర కమిషనర్, మున్సిపల్ సిబ్బంది, మేయర్, కార్పొరేటర్లు, సంబంధిత శాఖల అధికారులు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు.
గత ఏడాది దేశవ్యాప్తంగా 79 అవార్డులు ప్రకటించగా, ఆంధ్రప్రదేశ్‌కు ఐదు అవార్డులు వచ్చాయని, ఈసారి అవార్డుల సంఖ్యను 60కి తగ్గించినప్పటికీ రాష్ట్రం ఆరు అవార్డులు సాధించడం విశేషమని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ప్రకటించిన 60 అవార్డుల్లో కొన్ని ప్రత్యేక విభాగాలు ఉన్నాయని, హిల్ స్టేషన్లు, నదీ తీర ప్రాంత నగరాలకు ప్రత్యేక పోటీలు నిర్వహిస్తున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలకు అందుబాటులో ఉన్న 24 అవార్డు విభాగాల్లో ఆరు అవార్డులు సాధించడం ద్వారా రాష్ట్రం 25 శాతం విజయాన్ని నమోదు చేసిందని తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రతి నెల మూడవ శనివారం ఒక్కో జిల్లాలో స్వయంగా పాల్గొంటూ ప్రజల్లో పారిశుధ్యంపై అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులతో పాటు సామాన్య ప్రజల్లోనూ పరిశుభ్రతపై అవగాహన పెరిగిందని తెలిపారు.
నిజమైన స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ సాధించాలంటే ప్రభుత్వం ఒక్కటే కృషి చేస్తే సరిపోదని, ప్రజలందరూ కూడా బాధ్యతగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా ఉండడం, పారిశుధ్య కార్యక్రమాలకు సహకరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు.
వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌కు 50 శాతం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు సాధించాలనే లక్ష్యాన్ని ముఖ్యమంత్రి నిర్దేశించారని తెలిపారు. ఈ లక్ష్య సాధనకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మున్సిపల్ సిబ్బంది సమష్టిగా కృషి చేయాలని కోరారు.
![]()
