
సమస్యల పరిష్కారమే లక్ష్యం 44 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ బేవర జోగేశ్వరరావు
44 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ గా గెలుపొందిన బేవర జోగేశ్వరరావు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ప్రత్తిపాటి శ్రీధర్ బేవర జోగేశ్వరరావు కు శాలువ కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
బేవర జోగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల్లో తన గెలుపుకు సహకరించిన బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని కార్పొరేటర్
జోగేశ్వరరావు హామీ ఇచ్చారు.
శ్రీ గౌతమ్ స్కూల్ ప్రిన్సిపల్ సూర్యారావు, దినావాహి వారి సత్రం చైర్మన్ పైలా నరసింహారావు,
కూటమి నేతలు మలపు రెడ్డి అప్పారావు, నమ్మిభాను , మక్కేన భాస్కర్, తదితరులు పాల్గొన్నారు..
![]()
