
విజయవాడలో జాతీయ సరస్ మేళా-2026లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, కేంద్రమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, రామ్మోహన్ నాయుడు గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు పాల్గొన్నారు. ముందుగా సరస్ మేళా ప్రాంగణం వద్ద రాష్ట్రపతికి గవర్నర్, సీఎం, కేంద్రమంత్రులు స్వాగతం పలికారు. అనంతరం జాతీయ సరస్ మేళా కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన డ్వాక్రా మహిళలతో రాష్ట్రపతి, సీఎం గ్రూప్ ఫోటో దిగారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి, సీఎం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
![]()
