జనసేన పార్టీలోకి వంగవీటి రాధాకృష్ణ

Spread the love

జనసేన పార్టీలోకి వంగవీటి రాధాకృష్ణ

  • పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్

దివంగత వంగవీటి మోహన రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరేందుకు జనసేన కేంద్ర కార్యాలయానికి బుధవారం సాయంత్రం వచ్చిన వంగవీటి రాధాకృష్ణ ని పవన్ కళ్యాణ్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని సాదరంగా స్వాగతం పలికారు.
అనంతరం రాధాకృష్ణ తన అనుచరులను పవన్ కళ్యాణ్ కి పరిచయం చేశారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రత్యేకంగా ఫోటోలు తీయించుకున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్రజాసేవలో సమష్టి గా ముందుకు వెళదామని పవన్ కళ్యాణ్ ఈ సందర్బంగా దిశానిర్దేశం చేశారు.

Loading