
పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి.. 68 మంది లబ్ధిదారులకు రూ.56.30 లక్షల చెక్కుల పంపిణీ
వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక భరోసా
ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న బొండా ఉమా
ధి :-14-10-2026 ఈరోజు బుధవారం ఉదయం 11 గంటలకు సింగ్ నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 29 డివిజన్లకు చెందిన 68 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.56,30,000 (56 లక్షల 30 వేల రూపాయలు) విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను బొండా ఉమామహేశ్వరరావు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్యం చేయించుకోవడానికి ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో తోడ్పాటునందిస్తోందని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో కుటుంబంపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ సహాయాన్ని అందిస్తోందని పేర్కొన్నారు.
పేదల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది కూటమి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తోందని బొండా ఉమా తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం చేకూరేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన బాధితులకు సహాయం అందేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని వివరించారు.
ప్రజలకు ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని, అర్హులైన వారికి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రజాసేవే లక్ష్యంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, నియోజకవర్గ అభివృద్ధితో పాటు పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత డివిజన్ల నాయకులు, పార్టీ ప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
![]()
