పశ్చిమలో 18.60 కోట్లతో పార్కుల అభివృద్ధి పనులు, శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

Spread the love

పశ్చిమలో 18.60 కోట్లతో పార్కుల అభివృద్ధి పనులు, శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

పశ్చిమ నియోజకవర్గంలోని పార్కుల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదివారం శంకుస్థాపన చేశారు

సర్కిల్ వన్ ప్రాంతంలోని 16 పార్కులకు సంబంధించి ప్రహరీ గోడ, వాకింగ్ ట్రాక్లు, కూర్చునే బెంచీలు, ఓపెన్ జిమ్ , పిల్లల ఆట పరికరములు, పెయింటింగ్, నేమ్ బోర్డ్స్, నీటి సరఫరా, విద్యుత్ తదితర అభివృద్ధి పనులకు 43 వ డివిజన్, గీతా మందిరం పార్క్ లో కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ పశ్చిమ లోని 16 పార్కులను అందరికీ ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు..

సీ ఈ,పీ సత్య కుమారి, ఈ ఈ టీ చంద్రశేఖర్,
ఎ ఈ కే శరత్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

Loading