
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం జిల్లా అధికార యంత్రాంగం, దేవాదాయ శాఖ, ఆలయ అధికారులు, సిబ్బంది పటిష్ట సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీశ భక్తులకు అందుతున్న సౌకర్యాలను ప్రతిక్షణం పరిశీలిస్తూ ఎక్కడైనా లోటు పాట్లు ఉంటే సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎక్కడా తాగునీటి సమస్య లేకుండా చూస్తున్నారు.
![]()
