
15 రోజుల పాటు ఇంటింటి ప్రచారం.. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తప్పనిసరిగా విస్తృతంగా తీసుకెళ్లాలి, రూ.600 కోట్లకు పైగా అభివృద్ధి పనులు.. ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు తెలియజేయాలి – MLA బొండా ఉమామహేశ్వరరావు
బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
బీసీల రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయానికి ప్రభుత్వం పెద్దపీట – ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
ధి :-10-10-2026 ఈరోజు సాయంత్రం BRTS రోడ్డులోని ఉన్న సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో సెంట్రల్ నియోజకవర్గ బీసీ సెల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని బీసీల హక్కులు, అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమ మాట్లాడుతూ,:- బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం న్యాయపరంగా పోరాటం చేసిందని తెలిపారు. బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంతోపాటు స్థానిక సంస్థల పాలనలో వారు కీలక పాత్ర పోషించేలా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బీసీలకు ఇచ్చిన హామీ మేరకు వారి హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని…
బీసీ వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం సాధన కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని, ఈ లక్ష్యాల సాధనకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. బీసీలకు రాజకీయ అవకాశాలు పెరగడం ద్వారా వెనుకబడిన వర్గాలకు పాలనలో భాగస్వామ్యం పెరుగుతుందని, సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.
అలాగే ముఖ్యంగా 15 రోజుల పాటు ఇంటింటి ప్రచారం ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, రేపటి నుంచి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 15 రోజుల పాటు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
ముఖ్యంగా మహిళలకు శ్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, తల్లికి వందనం పథకం ద్వారా అందించిన ఆర్థిక లబ్ధి, ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF), ఎల్ఓసీల ద్వారా బాధిత కుటుంబాలకు అందించిన సహాయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రూ.600 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన నూతన రహదారుల నిర్మాణం, పార్కుల అభివృద్ధి తదితర కార్యక్రమాలను ప్రతి ఇంటికీ వివరించాలని తెలిపారు.
ఈ ప్రచార కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కమిటీల సభ్యులతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పాల్గొనాలని సూచించారు. కూటమి తరఫున ఎంపిక చేసిన అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో పనిచేస్తూ, పూర్తి సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో:- సెంట్రల్ నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు ఇప్పిలి రామ్మోహన్రావు, రాష్ట్ర నాగవంస కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణారావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాసరి ఉదయశ్రీ, పద్మశాలి డైరెక్టర్ సంగం వెంకన్న, పిరియా సోమేశ్వరరావు, మరక శ్రీనివాస్ యాదవ్, బెజవాడ తిరుపతి, కంచి ధన శేఖర్, P, డోలా జనార్ధన్, అమర్నాథ్ గౌడ్, బెవర నారాయణ, సింహాచలం, మాచర్ల గోపి, ఇమ్మడి రాము, చింతపల్లి కనకారావు, కొండపల్లి రూప్ కుమార్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు, మహిళలు, యువత, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
![]()
