
బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలు సామాజిక న్యాయానికి నిదర్శనం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి అభినందనలు తెలిపిన పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ బుద్ధా వెంకన్న
విజయవాడ గాంధీ నగర్ శ్రీ రామ ఫంక్షన హల్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి అభినందనలు తెలియజేస్తూ, పాలాభిషేకం నిర్వహించి అనంతరం విస్తృత స్థాయి సమావేశంలో జాతీయ పార్టీ ఉపాధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుద్ధా వెంకన్న పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ…
“స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే నిర్ణయం బీసీల రాజకీయ ప్రాతినిధ్యానికి ఎంతో కీలకమైన అంశం. సమాజంలో వెనుకబడిన వర్గాలకు రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం.
బీసీల అభ్యున్నతి, ఆత్మగౌరవం, రాజకీయ సాధికారతకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రాధాన్యతనిస్తూ వచ్చింది. బీసీలకు సముచితమైన అవకాశాలు కల్పించడం ద్వారా వారు స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా ఎదిగి, తమ ప్రాంతాల అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి మార్గం సుగమం అవుతుంది.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. బీసీల సంక్షేమం, అభివృద్ధి కి రాజకీయం గా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. బీసీలకు న్యాయం జరిగేలా, అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయ అవకాశాల గురించి అవగాహన కల్పించేలా కృషి చేయాలి” అని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.
ఈ సమావేశంలో నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ కే నాగుల్ మీరా, గ్రంథాలయ చైర్మన్ MS బేగ్, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వర రావు,sk ఆశ, సుఖాసి కిరణ్, మాజీ కార్పొరేటర్లు హబీబుల్లా, ఉమ్మడి చంటి, కొట్టేటి హనుమంతరావు, గుర్రంకొండ మరియు వివిధ డివిజన్ల అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
![]()
