దసరా ఉత్సవాల సందర్భంగా ఆనవాయితీ ప్రకారం అమ్మవారికి మొట్టమొదటి పట్టు వస్త్రాలు సమర్పించిన నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. దంపతులు

Spread the love

ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ.
ది.10.10.2026

దసరా ఉత్సవాల సందర్భంగా ఆనవాయితీ ప్రకారం అమ్మవారికి మొట్టమొదటి పట్టు వస్త్రాలు సమర్పించిన నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. దంపతులు

విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ది.11.10.2026వ తేదీ నుండి ది.20.10.2026వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేడుకలను పురష్కరించుకుని పోలీస్ వారి ఆడపడుచు అయిన అమ్మవారికి అనాదిగా వస్తున్న అనవాయితీ ప్రకారం సాంప్రదాయ నేపథ్యంలో నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., కుటుంబ సమేతంగా ది.10.10.2026వ తేదీ సాయంత్ర సమయంలో శ్రీ కనకదుర్గ అమ్మవారికి చీరా, సారెను సమర్పించడం జరిగింది.

ఈ నేపథ్యంలో ముందుగా పోలీస్ కమీషనర్ దంపతులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణంలోని రావి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలతో అంగరంగ వైభవముగా ఊరేగింపుతో అమ్మవారికి చీర, సారెను తీసుకుని కనకదుర్గ గుడికి వెళ్ళగా, ఈ.ఓ. శీనానాయక్ మరియు ఆలయ వైదిక కమిటీ వారు నగర పోలీస్ కమీషనర్ దంపతులను సాదరంగా ఆహ్వానం పలికి పరివేట్టంతో వేద పండితుల మంత్రొచ్చారణల నడుమ నగర పోలీస్ కమిషనర్ కుటుంబ సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., తో పాటు, పశ్చిమ డి.సి.పి. జి.రామ కృష్ణ ఏ.డి.సి.పి.లు, ఎ.సి.పి. ఎన్.వి.దుర్గా రావు ఏ.సి.పి.లు, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గుణరాం ఇనస్పెక్టర్లు, ఎస్.ఐలు మరియు పోలీస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Loading