విజయవాడ నగరపాలక సంస్థ
08-10-2026
స్వచ్ఛతా హి సేవాలో భాగంగా తమ చాంబర్లను స్వయంగా పరిశుభ్రం చేసుకున్న అధికారులు

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ డాక్టర్ డి. చంద్రశేఖర్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్. గౌరీ గురువారం ఉదయం తమ తమ చాంబర్లను స్వయంగా పరిశుభ్రం చేసుకున్నారు.
స్వచ్ఛత అనేది కేవలం పారిశుద్ధ్య సిబ్బంది బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా స్వచ్ఛతలో భాగస్వాములు కావాలని తెలియజేస్తూ అధికారులు స్వయంగా తమ చాంబర్లను శుభ్రం చేసి సిబ్బందికి, ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.
![]()
