అర్హులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పత్రాల అందజేత

కూటమి నేతలతో కలిసి అందజేసిన ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన -2.0 పథకం ద్వారా అర్హులైన 36 మందికి పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో మంజూరు పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్, జనసేన పార్టీ 42 వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన -2.0 ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో 36 మంది లబ్ధిదారులకు పక్కా గృహాల మంజూరు పత్రాలను అందజేసినట్లు తెలిపారు.
సొంతింటి కల నెరవేరుతున్న కుటుంబాలకు వారు శుభాకాంక్షలు తెలిపారు
ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కూటమి నేతలు పేర్కొన్నారు.
పీ ఎం ఏ వై 2.0 కింద కేంద్రం నుంచి రూ 1.50 లక్షలు రాష్ట్రం నుంచి రూ 1 లక్ష సహాయం అందుతుందని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ విజయవాడ డివిజన్ ఈ ఈ, జీ కపూర్ అన్నారు.
రానున్న రోజుల్లో మరి కొంతమంది అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు…డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బీ పిచ్చయ్య, ఎ ఈ కే రాజేష్….
కూటమి నాయకులు పత్తి నాగేశ్వరరావు, దాడి అప్పారావు,
బెన్నా భక్తుల సోమేశ్వరరావు, పులిచేరి రమేష్, రౌతు వాసు, విశ్సంశెట్టి విశ్వేశ్వరరావు, జయబాలన్, పల్లంటి ఆది, బాదర్ల శివ, శనివారపు శివ, నాగోతి రామారావు, బొడ్డుపల్లి శ్రీనివాస్,పోతినిడి లోకేష్, కొప్పుల గంగాధర్, కొమర కిరణ్, బొమ్ము రాంబాబు తదితరులు పాల్గొన్నారు…
![]()
