మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ పత్రాలు అందజేత

ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిది నుంచి మంజూరైన ఎల్ ఓ సీ పత్రాలను కూటమి నేతలతో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఎన్డీయే కార్యాలయంలో అందజేశారు..
సితార ప్రాంతానికి చెందిన ఆర్ జయ (59) బ్రెయిన్ స్ట్రోక్ కు గురై అత్యవసర వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 7.73 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు..
నాలుగు స్తంభాల సెంటర్ కు చెందిన కందుల జయలక్ష్మి (44) గర్భాశయ సమస్యతో బాధపడుతూ వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 2.10 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు.
నాలుగు స్తంభాల సెంటర్ కు చెందిన సీ హెచ్ కృష్ణ వేణి (49) బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతూ వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 6.19 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు.
త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు…
కూటమి నాయకులు బొడ్డుపల్లి శ్రీనివాస్, బొమ్ము రాంబాబు, యర్రంశెట్టి విశ్వేశ్వరరావు , సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు..
![]()
