దుర్గమ్మ ఆలయ అభివృద్ధికి, మాస్టర్ ప్లాన్‌పై ఎంపీ కేశినేని శివనాథ్ సమీక్ష

Spread the love

దుర్గమ్మ ఆలయ అభివృద్ధికి, మాస్టర్ ప్లాన్‌పై ఎంపీ కేశినేని శివనాథ్ సమీక్ష
విజ‌య‌వాడ : ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం మాస్టర్ ప్లాన్, అభివృద్ధి పనులపై గురువారం ఎంపీ కేశినేని శివ‌నాథ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష స‌మావేశం అనంతరం, ఎంపీ కేశినేని శివ‌నాథ్ , మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న‌ ఇతర అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. మహామండపం, కనకదుర్గ నగర్ ప్రాంతాల్లో జరుగుతున్న, చేపట్టబోయే పనులను పరిశీలించారు.

ఈ సమావేశంలో ఆల‌య చైర్మ‌న్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) , ఈవో వి.కె సీనా నాయక్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, ఇతర ఇంజనీరింగ్, పోలీస్ అధికారులతో కలిసి ఆలయ అభివృద్ధి ప్రణాళికలపై సమగ్రంగా చర్చించారు.

దేవస్థానం కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆలయ అభివృద్ధి పనుల పురోగతి, భవిష్యత్తు ప్రణాళికలపై ప్రధానంగా చర్చించారు. ఇంజనీర్-1 కె.వి.ఎస్.ఆర్. కోటేశ్వర రావు, ఇంజనీర్-2 రాంబాబు ల‌తో పాటు ఇతర డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు మాస్టర్ ప్లాన్ వివరాలను ఎంపీ కేశినేని శివ‌నాథ్ కు వివరించారు. పశ్చిమ ఏసీపీ దుర్గా రావు, సీఐ గురు ప్రసాద్ కూడా ఈ చర్చల్లో పాల్గొని భద్రతాపరమైన అంశాలపై సూచనలు అందించారు.

Loading