ముంబై నేషనల్. ఐ ఓ టీ స్కిల్ కాంపిటీషన్ కు సెలెక్ట్ అయిన జీ ఎన్ ఆర్ ఎం సీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు…

Spread the love

ముంబై నేషనల్. ఐ ఓ టీ స్కిల్ కాంపిటీషన్ కు సెలెక్ట్ అయిన జీ ఎన్ ఆర్ ఎం సీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు…

అభినందించిన ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్

ఈ నెల20,21, తేదీల్లో ముంబై లో జరగనున్న స్మార్ట్ క్లాస్ రూమ్ క్లైమేట్ సస్టైనబులిటీ నెట్వర్క్ కాన్సెప్ట్ పై నిర్వహించనున్న నేషనల్ ఐ ఓ టీ స్కిల్ కాంపిటీషన్ కి రామరాజ్యనగర్ లోని, జీ ఎన్ ఆర్ ఎం సీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు..

సీడ్స్ సంస్థ మరియు సుజనా ఫౌండేషన్ విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్నాయి.

ముంబై కు చెందిన టెక్కీ సంస్థ గ్రోక్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్ధులు సీడ్స్ సంస్థ సిబ్బందితో కలిసి భవానిపురం లోని ఎన్డీఏ కార్యాలయానికి విచ్చేశారు..

కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు..

జీ ఎన్ ఆర్ ఎం సీ ప్రభుత్వ పాఠశాలలో సుజనా ఫౌండేషన్,సీడ్స్ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన
ఐ ఓ టీ ల్యాబ్ లను ఎమ్మెల్యే సుజనా చౌదరి గత ఏడాది ప్రారంభించారు..

ల్యాబ్ లు తమకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ముంబైలో జరగనున్న నేషనల్ ఐ ఓ టీ స్కిల్ కాంపిటీషన్ లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు..

తమను ఎంతగానో ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి కు జీ ఎన్ ఆర్ ఎం సీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి వి రవి కుమార్ కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

Loading