4వ సారి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుగారిపై నిన్న జగన్ వ్యాఖ్యలు చూస్తే జగన్ ఫైర్ అయ్యారు మంత్రి కొలుసు పార్థసారథి

0

03.08.2025(టీడీపీ కేంద్ర కార్యాలయం)
సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశం వివరాలు

కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం చూసి జగన్ లో ఫ్రస్టేషన్ పెరిగిపోతుంది
భయంతోనో, ఫ్రస్టేషన్ తోనో దిగజారి ఉచ్చనీచాలు మరచి మాట్లాడుతున్నాడు
4వ సారి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుగారిపై నిన్న జగన్ వ్యాఖ్యలు చూస్తే జగన్ లో భయం బయట పడుతుంది
నేను ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేశాను ఇలాంటి రాజకీయం ఎప్పుడూ చూడలేదు
గెలిచినా ఓడినా నాయకులు ప్రజా సమస్యలపై హుందా మాట్లాడేవారు
వ్యక్తిగత దూషణలను ప్రోత్సహించేవారు కాదు
జగన్ ఇందుకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు
తన వ్యాఖ్యల ద్వారా జగన్ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు
రౌడీలు, గంజాయి స్మగ్లర్లు, బెట్టింగ్ రాయుళ్ల ఇళ్లకు వెళ్లడం పరామర్శలా?
పార్టీ ఉనికిలో ఉందని చెప్పుకోవడానికే కదా?

కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం చూసి జగన్ లో ఫ్రస్టేషన్ పెరిగిపోయి ఉచ్చనీచాలు మరచి దిగజారి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాడని.. సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కొలుసు పార్థసారథి మాట్లాడుతూ..

రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలు, ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్న తీరు, వారు రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్న విధ్వంసకర విధానాలు చూస్తుంటే రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా చాలా బాధేస్తుంది. నేను కూడా రెండున్నర మూడు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నా తండ్రి కూడా ఎమ్మెల్యేగా, ఎంపీ గా పని చేయడంతో రాజకీయాలని చాలా దగ్గరగా నాలుగైదు దశాబ్దాల నుంచి చూస్తూ ఉన్నాను. కానీ ఇటువంటి పరిస్థితి ఇటువంటి వాతావరణం ఈ విధంగా వ్యవహరిస్తు పార్టీ, నేతలను ఏనాడు చూడలేదు.

రాజకీయ పార్టీలు అన్నీ కూడా చాలా ఘాటుగా ప్రభుత్వాలను విమర్శించినా కూడా ఎక్కడ కూడా వ్యక్తిగత దూషణలు చేయలేదు. కించపరిచే విధంగా మాట్లాడటం, అప్రజాస్వామికంగా మాట్లాడటం ఎక్కడ కూడా చూడలేదు. అధికార పక్షాన్ని కించిపరచడం కోసం అరాచక శక్తులని ప్రోత్సహించడం ఎప్పుడూ చూడలేదు. హుందాగా ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజా సమస్యలే ప్రాధాన్యంగా పోరాటాలు చేసేవారు. ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తా ఉంటే చాలా బాధేస్తుంది . గెలుపు ఓటములు సర్వసాధారణం కానీ ప్రతి వ్యక్తి కూడా గెలిసినా ఓడినా నైతిక రాజకీయాలు చేయాల్సిన బాధ్యత ఉంది. బహుశా వైనాట్ 175 నుంచి 11 స్థానాలకి పడిపోవడం మూలంగా ఆయన ఈ విధంగా అనైతికంగా, అప్రజాస్వామికంగా విధ్వంసకర పరిస్థితులను ప్రోత్సహించే విధంగా ప్రవర్తిస్తున్నారు అనిపిస్తోంది.

ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి క్రింది స్థాయి నాయకులకు ఆదర్శంగా ఉండాలి. అనైతికంగా మాట్లాడటం అనేది చాలా తప్పు. జగన్ పర్యటనలు చూసినా ఆయన ఉపన్యాసాలు చూసినా ఆయన పత్రికా ప్రకటనలు చూసినా ఆయనలో ఒక ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది. ఆయనలో ఏదో ఒక అభద్రతా భావం కనపడుతుంది. ఆయనలో ఎందుకో ఒక భయం కనపడుతుంది.. మాటల్లో నియంత్రణ కోల్పోవటం. వ్యక్తిగత దూషణలకి దిగటం పరిపాటు అయిపోయింది. నేను ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర ఇంతకుముందు పని చేశాను ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంత్రి మంత్రిమండలిలో ఉన్నాను. గతంలో నేను మంత్రిగా పని చేసినప్పుడు ఉన్న ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి గారు కానివ్వండి రోసయ్య గారు కానివ్వండి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి జూనియర్ గా ఉన్న నాలాంటి మంత్రులు ఎవరైనా సరే అప్రజాస్వామికంగా మాట్లాడినా లేకపోతే ఏదైనా భాష సరిగ్గా మాట్లాడకపోయినా కూడా మందలించేవాళ్ళు మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాలి ఆదర్శవంతంగా మాట్లాడాలి మంత్రులుగా, శాసన సభ్యులు అయిన తర్వాత మీ భాషను మార్చుకోవాలని చెప్పి మందలించేవారు. కాని మమ్మల్ని ఎక్కడా తిట్టమని ప్రోత్సహించలేదు. నేడు మా నాయకుడు చంద్రబాబు కూడా కక్షపూరిత రాజకీయాలు మనకు వద్దు ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుని నియోజకవర్గంలో రాష్ట్రంలో సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా మీ మీ ఆలోచనలకి పదును పెట్టి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకొని అభివృద్ధిలోకి తీసుకువెళ్ళాలి ఏ విధంగా ప్రజలకి మనం ఉపయోగపడాలనే దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పారు.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతూ చెప్పుతో కొట్టారు గతంలో అని చెప్పేసి సంబోధించారంటే ఎంత దిగజారి మాట్లాడుతున్నారో ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారో అర్థమవుతుంది. ఒకవేళ గతంలో జరిగిన సందర్భాలే లక్ష్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారని అనుకుంటే ఎవరి గురించి అయితే జగన్ రెడ్డి సంబోధించారో వారు గత మూడు నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఈ మూడు నాలుగు దశాబ్దాల్లో రెండు దశాబ్దాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏరోజు కూడా ఆయన కక్షపూరిత రాజకీయాన్ని ఎప్పుడు కూడా చేయలేదు. మీరు 2019 – 2024 మధ్య చేసిన విధ్వం, అవినీతి, దోపిడి, అప్రజాస్వామిక పద్ధతులు అన్నీ మిమ్మల్ని వెంటాడి భయానికి లోను చేస్తున్నాయి. ఇది చాలా స్పష్టంగా అర్థం అర్థం అవుతుంది. ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, మాజీ మంత్రులు కానివ్వండి అరెస్ట్ అవుతున్నారు అంటే వారి మీద వ్యక్తిగత కారణాలతో కాదనే విషయాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. వైసీపీ నేతలు చేసిన తప్పుల నుంచి వారు చేసిన దోపిడీల నుంచి వారు చేసిన అరాచకాల నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఈ విధమైన నీచ రాజకీయాలు చేస్తున్నారు.

గంజాయికి బానిసై సమాజంలో అరాచకాలు సృష్టిస్తూ ఆడపిల్లల్ని హింసిస్తున్న వారి మీద పోలీసులు చర్యలు తీసుకుంటే జగన్ వెళ్లి వారిని పరామర్శిస్తున్నాడు. శాసన సభ్యురాలిగా ఉన్న ఒక సోదరిని నీచాతి నీచంగా దిగజారి మాట్లాడితే అతన్ని మందలించాల్సింది పోయి పరామర్శిస్తున్నాడంటే ఏమనుకోవాలి.. మహిళల పట్ల జగన్ కు ఉన్న గౌరవం ఏమిటో అర్థం అవుతుంది. ప్రజాస్వామ్యానికి ఆమోదయోగ్యమైన భాష మాట్లాడితే తప్పులేదు. కానీ చాలా అనైతికంగా, దిగజారుడుతనంగా మాట్లాడితే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి భాషని వాడే మీరందరూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. పరామర్శలు ఏ విధంగా జరుగుతాయి అనే దాని మీద ప్రజలందరికీ కూడా ఒక అవగాహన ఉంది. కానీ మీరు వెళ్తున్న తీరు వెళ్లి మాట్లాడుతున్న తీరు పరామర్శకి వెళ్ళినట్టు ఎక్కడ కనపడలేదు. మీ బలాన్ని ప్రదర్శించడానికి మీ భయాన్ని కప్పి పుచ్చుకోవడం కోసం జనాల్ని ఒకచోట పోగు చేసుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థమవుతుంది.

సంక్షేమం గురించి గంటలు గంటలు మాట్లాడడం వేరు… సంక్షేమం చేసి చూపించడం వేరు. నేడు కూటమి ప్రభుత్వంలో అందే సంక్షేమం… కొత్త చరిత్రను తిరగరాస్తోంది. గతంలో ఏ ప్రభుత్వాలు ఇవ్వని స్థాయి సంక్షేమాన్ని నేడు ప్రజలు అందుకుంటున్నారు.. జగన్ లో ప్రస్టేషన్ కు ఇది కూడా కారణం కావచ్చు. ప్రజల్లో అన్ని వర్గాల్లో పాజిటివ్ వస్తే తన పరిస్థితి ఏమీ మిగలదు అని ఇలా వ్యవహరిస్తున్నాడు అనిపిస్తోంది. ఇది డైవర్షన్ పాలిటిక్స్, గగ్గోలు పాలిటిక్స్, దేశంలో నెలకు 64 లక్షల మందికి రూ.2720 కోట్లు పింఛన్లు ఇచ్చే ప్రభుత్వం మరొకటి ఉందా? ఈ నెలతో కలిపి దగ్గర దగ్గర రూ. 40 వేల కోట్లు కేవలం పింఛన్లపై ఖర్చు చేశాం. ఇది కాదా సంక్షేమం? తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ ఆర్థిక సాయం చేశాం. దీనికి దాదాపు రూ. 10 వేల కోట్లు ఖర్చు చేశాం. నాకు డబ్బులు పడలేదు అని ఎవరూ చెప్పే పరిస్థితి లేకుండా చేశాం. దీన్ని ఏమంటారు? 204 అన్న క్యాంటీన్లు పెట్టాం…. ఇప్పటికి 4 కోట్లమందికి పైగా భోజనాలు చేశారు. అంటే జగన్ భాషలో పేదల కడుపునింపడం సంక్షేమం కాదా? 47 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లో దాదాపు రూ.3200 కోట్లు వారి అకౌంట్లో జమ చేశాం …..ఇది రైతు సంక్షేమం కాదా? ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నాం. జగన్ కళ్లు మూసుకుని సంక్షేమం లేదు అని పదే పదే గోల పెట్టి… అదే నిజం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం…. పోలీస్ రిక్రూట్ మెంట్ చేస్తున్నాం…పెట్టుబడుల తెచ్చి మళ్లీ పారిశ్రామిక రంగంలో ఊపు తెచ్చాం. ఇవన్నీ కనిపించడంలేదా ?ప్రతి వర్గానికి సాయంగా నిలుస్తున్నా.. ఉచిత ఇసుక తెచ్చి నిర్మాణ రంగాన్ని నిలబెట్టాం. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు పోరాటాలు చేయాలి. ప్రభుత్వాలను పశ్నించాలి. ప్రజల కోసం పనిచేయాలి. కానీ జగన్ కు తన సొంత ఉనికి, ప్రయోజనాలు తప్ప మరేమీ పట్టవు. ఇలాంటి రాజకీయ పార్టీలు చరిత్రలో మనుగడ సాగించలేదు.. జగన్ యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్ గా చరిత్రలో నిలిచిపోతారు ప్రజలు కూడా ఇలాంటి వారి పట్ల చైతన్యంతో ఉండాలి. మంచి చెడు చూడాలి.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version