2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలపై ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. అప్పుడు జరిగిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను రద్దు చేసింది. వివరాల్లోకి వెళ్తే… మెయిన్స్ జవాబు పత్రాలను చేతితో దిద్దే (మాన్యువల్) విధానం ద్వారా రెండు సార్లు మూల్యాంకనం చేశారని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. మొదటిసారి మూల్యాంకనం చేసిన ఫలితాలను పక్కన పెట్టి, రెండోసారి మళ్లీ మూల్యాంకనం చేయించి నచ్చిన వారిని ఎంపిక చేసి ఏపీపీఎస్సీ ఫలితాలను ప్రకటించిందని పిటిషన్ లో ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది.
![]()

