26న నిరసన ప్రదర్శనలను జయప్రదం చేయండి ఏపి ట్రేడ్ యూనియన్ల రైతు సంఘాల స్టీరింగ్ కమిటి పిలుపు

0

 26న నిరసన ప్రదర్శనలను జయప్రదం చేయండి

ఏపి ట్రేడ్ యూనియన్ల

రైతు సంఘాల స్టీరింగ్ కమిటి పిలుపు

 విజయవాడ: కేంద్ర బిజెపి ప్రభుత్వం 2021డిశంబరు 9న సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వానికి వ్రాత పూర్వకంగా ఇచ్చిన హామీలు అమలు పర్చ కుండా కార్పొరేట్ అనుకూల వ్యవసాయ, పారిశ్రామిక  విధానాల అమలుకు పూనుకుంటుంది. రైతాంగం, కార్మిక వర్గ డిమాండ్ల సాధనకోసం దేశవ్యాప్తంగా ట్రేడ్ యూనియన్ల జాయింట్ యాక్షన్ కమిటి, సంయుక్త కిసాన్ మోర్చాలు దేశవ్వాప్తంగాఇచ్చిన పిలుపులో బాగంగా ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని జిల్లాలో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, సభలు జయప్రదం చేయాలని కోరుతూ ఎపి రైతుసంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వఢ్డే శోభనాధ్రీశ్వర రావు అధ్యక్షతన జరిగిన స్టీరింగ్ కమిటీ పిలుపు ఇచ్చింది.

అనంతరం గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన పత్రికా విలేఖరుల సమావేశంలో వఢ్డే శోభనాధ్వీశ్వరరావు మాట్లాడుతూ పేదరైతులు, కౌలురైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రజల కష్టార్జితం కార్పొరేట్లకు కట్ట బెట్టటం ఏమాత్రం సబబు కాదని, రైతులకు రుణమాఫీ చేయమని అడుగుతుంటే కార్పో రేట్లకు రుణాలు మాఫీ చేయటం ఏమిటని ప్రశ్నించారు. నవంబరు 26న

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు

హెచ్చరిక నోటీసులు ఇస్తామని అన్నారు.

26 ఉదయం10 గంటలకు తుమ్మలపల్లి కళా క్షేత్రం వద్ద నుండి ప్రదర్శన జరుగుతుందని, అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందిస్తామన్నారు.

ఎపి రైతు సంఘం కార్యదర్శి కెవివి ప్రసాద్ మాట్లాడుతూ మధ్దతు ధరల చట్టం సాధించే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి

సిహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ కార్మిక వర్గం 

రైతాంగంతో కలిసి ధీర్ఘకాలిక పోరాటా నికి సిద్ధం అవుతుందని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రవేటికరించనీయమని ప్రదాని మోడీ రాక సందర్బంగా నిరసన తెలియజేస్తామన్నారు. 

రైతు సంఘం సీనియర్ నాయకులు వై కేశవరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలన్ని  రాష్ట్ర ప్రభుత్వం బలపరుస్తుందని, విద్యుత్ వినియోగదారుపై 17వేల కోట్లు భారాలు వేస్తుంది. ఉపసంహరించాలన్నారు. ఎఐటియుసి కార్యదర్శి ఓబులేశు మాట్లాడుతూ కార్మిక కోడ్ల రద్దు తోపాటు, రాష్ట్ర ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలపై  పోరాడతామన్నారు. 

 సమావేశంలో ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాధ్, కిసాన్ సభ రాష్ట్ర అధ్యక్షులు హరినాథ్, కిసాన్ కాంగ్రెస్ నాయకులు గోగినేని గుణశేఖర్, ఇఫ్టూ నాయకులు రామకృష్ణ  పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version